Jr Ntr Devara : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా 'దేవర పార్ట్-1' తెరకెక్కించారు డైరెక్టర్ కొరటాల శివ. సెప్టెంబర్ 27న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో మూవీటీమ్ చిట్ చాట్‌లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో హీరో ఎన్టీఆర్,హీరోయిన్ జాన్వీ కపూర్‌తో పాటు డైరెక్టర్ కొరటాల శివ కూడా పాల్గొన్నారు. అయితే ఈ చిట్టాట్కు సంబంధించిన వీడియో టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ క్లిప్‌లో సందీప్‌రెడ్డి వంగ, మూవీటీమ్ ఎన్టీఆర్, కొరటాల శివ, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్‌ను కొన్ని ఫన్నీ క్వశ్చన్లు అడిగారు. అందులో భాగంగానే 'దేవర పార్ట్- 1' రన్ టైం ఎంతసేపు ఉండొచ్చని కొరటాలను పాయింట్ చేసి అడిగారు. ఆ క్వశ్చన్ మధ్యలో దూరిన ఎన్టీఆర్ 'అసలు యానిమల్ సినిమా రన్ టైం ఎంత సర్?' అంటూ సెటైర్ వేశారు. ఇక మూవీటీమ్‌తో జరిగిన చిట్‌చాట్ ఆధ్యంతం సరదాగా సాగింది. జాన్వీ క్యారెక్టర్ డిజైన్ చేయడానికి చాలా కష్టపడినట్లు డైరెక్టర్ శివ అన్నారు. సందీప్ ప్రశ్నలకు జాన్వీ 'సినిమా స్టోరీ మొత్తం చెప్పేయాలా?' అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. హీరో ఎన్టీఆర్ సినిమా ఆఖరి 40 నిమిషాల గురించి చెబుతూ ఆసక్తి పెంచేశారు. ఈ సినిమా కోసం ఓ ప్రపంచాన్నే క్రియేట్ చేసినట్లు చెప్పారు. ఇక మూవీటీమ్ ఈ సినిమా గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇందులో షేర్ చేసుకున్నారు. అవన్నీ తెలియాలంటే ఫుల్ వీడియో చూడాల్సిందే!
క్లైమాక్స్ డోంట్ మిస్
'దేవర విజువల్స్ సూపర్‌గా ఉంటాయి. చివరి 40 నిమిషాలు అయితే ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. సినిమా సినిమాకీ కొరటాల శివపై నా ప్రేమ, గౌరవం పెరుగుతోంది. ఆయనతో చాలా కాలంగా పరిచయం, ప్రేమ ఉంది. నా బృందావనం చిత్రానికి శివ రచయితగా ఉన్నారు. కమర్షియల్ సినిమాల్లో ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్తుంటాడు హీరో. కానీ దేవర దానికి భిన్నంగా ఉంటుంది. ఇందులో మనిషిని చంపేంత ధైర్యంతో ఉండే కొందరికి హీరో భయాన్ని పరిచయం చేస్తాడు. అండర్ వాటర్‌లో 38 రోజులు షూటింగ్ చేశాము. హై ఓల్టేజ్ యాక్షన్‌తో ఈ మూవీ రాబోతుంది' అని ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో అన్నారు.