Jr NTR Devara:గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'దేవర'. ఈ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్‌తోపాటు టాలీవుడ్ మూవీ లవర్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, ఫొటో లీకైనా వెంటనే సోషల్ మీడియాలో ట్రెండిగ్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తాజా వ్యాఖ్యలు ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపాయి. దేవర విడుదల కాస్త ఆలస్యం అయినప్పటికీ సినిమా రిజల్ట్ మాత్రం అభిమానులు షర్ట్ కాలర్ ఎగరేసేలా ఉంటుందని అన్నారు. దీంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలుతున్నారు.
సోమవారం హైదరాబాద్‌లో జరిగిన 'టిల్లు స్వ్కేర్' మూవీ సక్సెస్ మీట్‌కు తారక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో ఆయన దేవర రిలీజ్ గురించి ఈ కామెంట్స్ చేశారు.'దేవర అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే. రేపు పొద్దున గర్వంగా మీరందరూ (ఫ్యాన్స్) కాలర్ ఎగరేసుకునేలా ఆ చిత్రాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాం. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు' అని అన్నారు.
ఇక దేవర సినిమా విషయానికొస్తే, ఇప్పటికే రిలీజైన వీడియో గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. రీసెంట్గా గోవాలో ముఖ్యమైన షెడ్యూల్ జరుపుకుంది. ఈ షెడ్యూల్లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్- ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సీన్స్ తెరకెక్కించారని టాక్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. కథ డిమాండ్ మేరకు ఎన్టీఆర్ మూడు పాత్రలు చేస్తున్నారని అంటున్నారు. అయితే గ్సింప్స్ రిలీజ్ అయ్యాక దేవరలో ఎన్టీఆర్ తండ్రీ- కుమారుడి పాత్రలో (డ్యయల్) నటిస్తున్నారని టాక్ వినిపించింది. రీసెంట్గా రిలీజ్ డేట్ పోస్టర్ వచ్చేసరికి సినిమాలో ఎన్టీఆర్‌ది ట్రిపుల్ రోల్ అని అంటున్నారు.