తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చిరు నటించిన ఆ రెండ్ బ్లాక్ బస్టర్స్​కు సీక్వెల్​! : అనౌన్స్ చేసిన అశ్వినీ దత్​ - Chiranjeevi Hit Movie Sequel - CHIRANJEEVI HIT MOVIE SEQUEL

Chiranjeevi Aswani Dutt : మెగాస్టార్ చిరంజీవి నటించిన రెండు బ్లాక్ బస్టర్​ సినిమాలకు సీక్వెల్​ను అనౌన్స్​ చేశారు నిర్మాత అశ్వినీ దత్​! పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat and ANI
Chiranjeevi Aswani Dutt (source ETV Bharat and ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2024, 9:40 AM IST

Chiranjeevi Aswani Dutt : మెగాస్టార్ చిరంజీవి కెరీర్​లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రాల్లో ఇంద్ర, జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలను వైజయంతీ మూవీస్ బ్యానర‌లో అశ్వినీ దత్ నిర్మించారు. అయితే ఈ మూవీస్​కు సీక్వెల్స్ తెరకెక్కించాలని చాలా రోజులుగా ఫ్యాన్స్​ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై అశ్వినీ దత్ స్పందించారు. అభిమానులకు అదిరిపోయే వార్తను చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమాను రీరిలీజ్​ చేసిన సంగతి తెలిసిందే. 2002లో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్​ సాధించింది. ఇప్పుడు రీ రిలీజ్​లోనూ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను అందుకుంటోంది. ఈ సందర్భంగా ఇంద్ర చిత్ర బృందాన్ని తన ఇంటికి పిలిచి సన్మానించారు మెగాస్టార్​ చిరంజీవి. ఈ వేడుకలో నిర్మాత అశ్వినీ దత్​, దర్శకుడు బి.గోపాల్​తో పాటు రచయితలు పరుచూరి బ్రదర్స్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, చిన్ని కృష్ణ పాల్గొన్నారు.

వీరందరికీ చిరు శాలువాలను కప్పి సన్మానించారు. అలానే అశ్వినీ దత్​కు ప్రత్యేకంగా పాంచజన్యాన్ని బహుమతిగా ఇచ్చారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లోగోపై సీనియర్​ ఎన్టీఆర్ కృష్ణుడి వేషధారణలో ఈ పాంచజన్యాన్ని పూరిస్తూ కనిపిస్తారు. అందుకే ఈ పాంచజన్యాన్ని బహుమతిగా ఇచ్చానని చిరు చెప్పారు.

Indra, Jagadeka veerudu athiloka sundari Sequel : ఇక ఈ సన్మాన కార్యక్రమం పుర్తైన తర్వాత మీడియాతో ముచ్చటించిన నిర్మాత అశ్వినీ దత్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇంద్ర, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలకు సీక్వెల్స్ తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ రెండు సీక్వెల్స్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, వీటికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని వెల్లడించారు.

చరణ్​, జాన్వీ కలిసి నటించాలని - వాస్తవానికి జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ సీక్వెల్ గురించి ఆ మధ్య చిరంజీవి కూడా మాట్లాడారు. మొదటి భాగంలో చిరు - శ్రీదేవి కలిసి నటించగా, సీక్వెల్​లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించాలని తాను ఆశిస్తున్నట్లు మెగాస్టార్​ తెలిపారు.

Indra Rerelease Collections - ఇంద్ర సినిమా ఇప్పుడు రీ రిలీజ్​లోనూ మంచి వసూళ్లను అందుకుంటున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్​లో తెరకెక్కిన ఈ సినిమాను మళ్లీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మొదటి రోజు ఈ చిత్రానికి మూడు కోట్ల ఐదు లక్షలకుపైగా కలెక్షన్స్​ వచ్చినట్లు సమాచారం.

OTTలో ఫ్రీగా చిరంజీవి బ్లాక్‌ బ‌స్ట‌ర్ మూవీ - ఆఫర్​ రెండు రోజులు మాత్ర‌మే - OTT Chiranjeevi Movie

'ప్రభాస్‌తో నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి!' : శ్రీదేవి విజయ్​ కుమార్​ - Sridevi Vijaykumar Prabhas

ABOUT THE AUTHOR

...view details