These Indian Celebrities Cant Cast Their Votes: ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. ప్రస్తుతం 5వ విడత ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకుంటున్నారు. సామాన్య పౌరుల నుంచి సినిమా వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ ఓట్ల పండగలో పాల్గొని తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు మాత్రం తమ ఓటును ఎప్పుడూ వేయలేదు. మరి వాళ్లు ఎవరు, ఓటు వేయకపోవడానికి గల కారణాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
అలియా భట్: ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ తన నటనా నైపుణ్యంతో చాలా ఫేమస్ అయ్యారు. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యారు. అయితే ప్రస్తుతం అలియా లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. అందుకు కారణం.. ఆమె బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. అలియా తన తల్లి నుంచి బ్రిటిష్ పౌరసత్వాన్ని వారసత్వంగా పొందారు. ఈ కారణంగా భారత ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హత పొందలేదు.
కత్రినా కైఫ్:బాలీవుడ్‌లో మరో ఫేమస్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఎప్పుడూ ఓటు వేయలేదు. కారణం.. ఆమె కూడా బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉండటమే. హాంకాంగ్‌లో జన్మించిన ఈ బ్యూటీ బ్రిటిష్ సిటిజన్‌షిప్ ఉండటం వల్ల భారత ఎన్నికలలో ఓటు వేయలేకపోయింది.
'వారందరూ అలాంటోళ్లు' - టాలీవుడ్ స్టార్ హీరోలపై కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! - Kajal Agarwal
జాక్వెలీన్ ఫెర్నాండెజ్:జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరు. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఆమెకు 44 మిలియన్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. అలాగే 2006లో మిస్ శ్రీలంక యూనివర్స్ టైటిల్ కూడా గెలుచుకుంది. అయితే ఈమె కూడా ఎన్నికల్లో ఓటు వేయలేదు. కారణం.. జాక్వెలిన్ శ్రీలంక పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు.
ఇమ్రాన్ ఖాన్:బాలీవుడ్‌లో ఫేమస్ అయిన ఇమ్రాన్ ఖాన్ పుట్టుకతో అమెరికన్. విస్కాన్సిన్‌లోని మాడిసన్‌లో అతను జన్మించాడు. పలు సినిమాల ద్వారా గుర్తింపు పొందినా కూడా.. ఇమ్రాన్ అమెరికన్ పౌరసత్వం కలిగి ఉండటం కారణంగా అతను ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు.
సన్నీ లియోన్:బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా సన్ని లియోన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఈమెకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. అయితే సన్ని కెనడియన్-అమెరికన్ పౌరసత్వం కలిగి ఉన్నందు వల్ల ఆమె లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారు.