తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఎన్టీఆర్​కి హృతిక్ రోషన్ సరిపోరు- ఫ్యాన్స్ చొక్కాలు చించుకోడానికి రెడీ అవ్వండి!' - NTR WAR MOVIE

ఎన్టీఆర్ వార్ 2పై విశ్వక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్- తారక్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతారంట!

NTR WAR Movie
NTR WAR Movie (Source : ETV Bharat (Left), Getty Images (Right))

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2024, 10:26 PM IST

NTR WAR Movie :గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'వార్ 2'గురించి టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్​సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వార్​ 2 సినిమాలో ఎన్టీఆర్ నటన ఆద్భుతంగా ఉంటుందని విశ్వక్ అన్నారు. ఎన్టీఆర్ రీసెంట్ బ్లాక్​బస్టర్ 'దేవర' రీసెంట్​గా 50 రోజుల థియేటర్ రన్ పూర్తి చేసుకుంది. దీంతో ఫ్యాన్స్ హైదరాబాద్​లో గ్రాండ్ సెలబ్రేషన్స్​ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హాజరైన హీరో విశ్వక్ ఈ కామెంట్స్ చేశారు.

'వార్​ 2' లో ఎన్టీఆర్​తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హృతిక్ కంటే ఎన్టీఆర్​ నటనే అద్భుతంగా ఉండనుందని ఆన్నారు. ఆయన నటనకు ఫ్యాన్స్ చొక్కాలు చించుకోడానికి రెడీగా ఉండాలంటూ హుషారెత్తించారు. 'ఎదురుగా ఉన్నది హృతిక్ రోషన్ అయినా సరిపోదు. అన్న బటన్ విప్పుతడు. మీరు బట్టలు చించుకోడానికి రెడీ అవ్వండి' అని అన్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా కేరింతలు కొట్టారు.

కాగా, వార్ 2 సినిమాను అయాన్‌ ముఖర్జీ పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ పలు షెడ్యూల్​లలో పాల్గొన్నారు. ఆయనపై పలు కీలక సన్నివేశల చిత్రీకరణ పూర్తయ్యిందని టాక్. మరోవైపు హృతిక్ కూడా రెగ్యులర్ షూటింగ్​లో పాల్గొంటున్నారట. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ కీలక పాత్రలో నటిస్తోంది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ ఈ ప్రాజెక్ట్​ను భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది.

ఇక కొరటాల శివ దర్శకత్వంలో కెరకెక్కిన 'దేవర పార్ట్ 1' సినిమా మంచి విజయం అందుకుంది. సెప్టెంబర్ 27న వరల్డ్​వైడ్​గా రిలీజైన దేవర ఇటీవల 52 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించారు. జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటించగా, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, శ్రుతి మరాఠే, చైత్ర, అజయ్, హరితేజ తదితరులు ఆయా పాత్రలు పోషించారు. కాగా, ఈ సినిమా వరల్డ్​వైడ్​గా ఈ సినిమా రూ.550+ కోట్లు వసూల్ చేసింది.

'వార్ 2'పై ఎన్టీఆర్ ఫోకస్- షూటింగ్ సెట్స్​లోకి రీ ఎంట్రీ! - NTR War 2 Update

'వార్​ 2'లో మరో తెలుగు స్టార్ - ఈ క్యారెక్టర్ చాలా పవర్​ఫుల్​! - Jr NTR War 2 Cast

ABOUT THE AUTHOR

...view details