తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వావ్ రెడ్​ డ్రెస్​లో శ్రీలీల గ్లామర్ ట్రీట్ - మత్తుకళ్లతో మతిపోగొడుతూ - Sreeleela Photoshoot - SREELEELA PHOTOSHOOT

Heroine Sreeleela Latest Photoshoot : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల తాజాగా రెడ్ కలర్​ డ్రెస్సులో హాట్ ఫోజులు ఇచ్చింది. తన కసి చూపులతో కుర్రాళ్ల కంటి మీద కునకులేకుండా చేసేసింది. హాట్ లుక్​లో అదిరిపోయే రేంజ్​లో పోజులు ఇస్తూ కవ్వించింది. మీరు చూశారా?

వావ్ రెడ్​ డ్రెస్​లో శ్రీలీల గ్లామర్ ట్రీట్  - మత్తుకళ్లతో మతిపోగొడుతూ
వావ్ రెడ్​ డ్రెస్​లో శ్రీలీల గ్లామర్ ట్రీట్ - మత్తుకళ్లతో మతిపోగొడుతూ

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 8:28 AM IST

Updated : Apr 4, 2024, 9:41 AM IST

Heroine Sreeleela Latest Photoshoot : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చిత్రసీమలో చాలా దశాబ్దాల తర్వాత ఓ తెలుగందం డామినేషన్ చూపెడుతుందంటే అది శ్రీలీల మాత్రమే. వాస్తవానికి ఆమె తెలుగమ్మాయి కాదు. తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి. అనతికాలంలోనే అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు. అందాల ఆరబోతకు కాస్త హద్దులు పెట్టుకుంటూనే, అందమంతా కళ్లలో చూపిస్తూ, ప్రభుదేవా డూప్‌లా డ్యాన్స్ చేస్తూ అలరిస్తున్నారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల నితిన్, రామ్, రవితేజ, బాలకృష్ణ, మహేశ్ బాబుల సరసన నటించి ఆహాఓహో అనిపించారు. ఆ మధ్య గుంటూరు కారంతో అలరించిన శ్రీలీల ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన కనిపించనున్నారు. మరిన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

మెరుపువన్నెల మేనిఛాయ హంసలను తలపించే నడకలలోని హొయ శ్రీలీల కళ్లను చూస్తేనే గుర్తొచ్చేస్తాయి. అశ్లీలత అణువంతైనా కనిపించకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కళ్లతోనే మత్తును కురిపిస్తూ కట్టిపడేస్తున్నారు. రీసెంట్‌గా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ @sreeleela14 అనే అకౌంట్ నుంచి తాజా ఫొటోషూట్​ను వదిలారు. రెడ్ డ్రెస్‌లో, గుచ్చే చూపులతో, ఒంపు దిరిగిన పెదవంచులతో ఇచ్చిన ఫోజులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తన కసి చూపులతో కుర్రాళ్ల కంటి మీద కునకులేకుండా చేసేశారు. హాట్ లుక్​లో అదిరిపోయే రేంజ్​లో పోజులు ఇస్తూ కవ్వించారు. ఇది చూసిన నెటిజన్లు, కుర్రాళ్లు - నిద్ర పట్టడం లేదు. ఈ కుర్ర భామ చూపులకు తట్టుకోలేక పోతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, తనకు సెట్ అయ్యే పాత్రలతో మెప్పిస్తున్న శ్రీలీల గ్లామర్ రోల్స్‌కు మొహమాటం లేకుండా నో చెప్పేస్తారట. అందుకోసమే రీసెంట్​గా బ్లాక్ బస్టర్​ హిట్ టిల్లు స్క్వేర్​తో పాటు పుష్ప 2లో స్పెషల్ సాంగ్​కు కూడా నో చెప్పారని వార్తలు కూడా వచ్చాయి. ఏదేమైనప్పటికీ అందం, అభినయం, ఆహార్యంతో పాటు అద్భుతంగా డ్యాన్స్ చేయగల శ్రీలీల మరిన్ని మంచి ప్రాజెక్టులతో, చక్కటి సినిమాల్లో కనిపించాలని ఆశిద్దాం.

బ్యాక్​ టు బ్యాక్​ 8 హిట్​ సీక్వెల్స్‌తో రానున్న స్టార్ హీరో! - Ajay Devgn Upcoming Movies
Last Updated : Apr 4, 2024, 9:41 AM IST

ABOUT THE AUTHOR

...view details