Heroine anjali Marriage : నటి అంజలి ప్రధాన పాత్రలో పదేళ్ల క్రితం వచ్చిన హారర్ సినిమా గీతాంజలి. ఈ చిత్రం అంజలి కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించింది. అయితే ఇప్పుడు సిక్వెల్తో కూడా అదే మ్యాజిక్ రీపీట్ అవుతుందని ఈ సినిమా యూనిట్ నమ్ముతోంది. ఈ మూవీ ఏప్రిల్ 11న విడుదల కాబోతున్న సందర్భంగా అంజలితో పాటు ఈ సినిమా నిర్మాత కోన వెంకట్ కూడా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.
తాజాగా ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఈటీవీలో సూపర్ హిట్ టాక్ షో అలీతో సరదాగాలో పాల్గొన్నారు అంజలి, కోన వెంకట్. ఇందులో తమ సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ఈ షోలో మొదటగా వచ్చిన అంజలికి ఒక బొకే ఇస్తూ 'ఇది అందుకే ఇస్తున్నాను' అని అలీ చెప్పగా అంజలి కూడా నవ్వుతూ తీసుకుంది. ఆ తర్వాత ప్రోమోలో అంజలి పెళ్లి టాపిక్ గురించి మాట్లాడుతూ అలీ 'అతనితో పెళ్లి అంటగా' అని అడిగితే - 'ఒక అగ్ర నిర్మాతతో' అంటూ అంజలి నవ్వులు పూయించింది. దీని బట్టి ఆమె తన రూమర్స్ గురించే మాట్లాడినట్లు అర్థమైంది.
ఎందుకంటే గతంలో అంజలి ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుని ఫారెన్‌లో సెటిల్ అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఓ తెలుగు నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం సాగింది. పెళ్లై విడాకులు తీసుకున్న నిర్మాతతో ఆమె ఏడడగులు వేయబోతున్నట్లు అన్నారు. దానిపైనే అంజలి స్పందించినట్లు అర్థమైంది.
ఇంకా స్పెషల్ సాంగ్స్ తాను ఎందుకు చేస్తున్నానో కూడా సమాధానం చెప్పింది అంజలి. స్క్రీన్ మీద వేసిన కొన్ని ఫోటోలను చూస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో తనకు నరాలు పట్టేసినట్లు గుర్తుచేసుకుంది. తాను అల్లరి బాగా చేస్తానని చెప్పుకొచ్చింది. సీతమ వాకింట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని పాట పాడి అలరించింది.