Happy Birthday Ramcharan : నేడు(మార్చి 27) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగా అభిమానులతో పాటు ఇతర సినీ సెలబ్రిటీలంతా ప్రత్యేకంగా విషెస్ తెలుపుతున్నారు. ఫ్యాన్స్ అయితే కేక్‌లు కట్ చేసి మరీ సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాను చరణ్ పేరుతో మార్మోగిస్తున్నారు. అలాగే ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వరుసగా రిలీజ్ అవుతూ మస్త్ ట్రెండ్ అవుతున్నాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కజీన్స్ మాత్రమే కాదు మంచి స్నేహితులు కూడా. అందుకే అల్లు అర్జున్ తన పోస్ట్‌లో "హ్యాపీ బర్త్ డే టు మై స్పెషల్ కజిన్, లవ్ యు అల్వేస్" అంటూ ఒక బ్లాక్ ఏమోజీని పోస్ట్ చేశారు. అలాగే పబ్‌లో తను, రామ్ చరణ్, అల్లు శిరీష్, నీహారిక కలిసి చిందులు వేస్తున్న వీడియోను షేర్ చేశారు.