Hanuman Movie Hindi Collection:తేజ సజ్జా- ప్రశాంత్ వర్మ హను-మాన్ సినిమా రెండో వారం కూడా సాలిడ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. శుక్రవారం (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు జోరందుకున్నాయి. ఈ క్రమంలో హనుమాన్ వరల్డ్‌వైడ్‌గా రూ.225+ కోట్లు వసూల్ చేసినట్లు ఇన్సైట్ వర్గాల టాక్. ఇక హిందీలోనూ సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా అక్కడ కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే హిందీలో హనుమాన్ రూ.40+ కోట్లు వసూల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక లాంగ్ రన్లో ఈ మూవీ మరో రూ.10కోట్లు దాటవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అటు నార్త్ ఇండియాలో రూ. 2.35 కోట్లు వసూల్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక హిందీలో అత్యధిక వసూల్ చేసిన డబ్బింగ్ సౌత్ఇండియా సినిమా (Hindi Dubbed South Indian Films) ల్లో హనుమాన్ 11వ ప్లేస్‌లో ఉంది. ప్రస్తుతం రూ.40+ కలెక్ట్ చేసిన హనుమాన్, ఇప్పటికే కేజీఎఫ్ పార్ట్- 1 (రూ.44.5 కోట్లు) సినిమాను దాటేసింది. ఈ క్రమంలో కార్తికేయ (రూ.33 కోట్లు), లియో (30.2 కోట్లు), జైలర్ (రూ. 30 కోట్లు) సినిమాలను కూడా హనుమాన్ ఎప్పుడో అధిగమించింది. ఈ లిస్ట్‌లో బాహుబలి ది కంక్లూజన్ రూ. 510.9 కోట్లతో టాప్‌లో ఉండగా, కేజీఎఫ్ పార్ట్- 2 రూ.435 కోట్లతో రెండో స్థానంలో ఉంది.
ఫైటర్‌తో బ్రేక్!బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన 'ఫైటర్' జనవరి 25న రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో హిందీలో హనుమాన్ కలెక్షన్స్‌పై ఫైటర్ ప్రభావం ఉండవచ్చు. ఈ సినిమాకు హిట్ టాక్ రావడం వల్ల అక్కడ హనుమాన్ వసూళ్లు తగ్గే ఛాన్స్ ఉంది.