Ram Charan Game Changer :గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ లీడ్ రోల్లో తెరకెక్కిన సినిమా 'గేమ్‌ఛేంజర్'. విజనరీ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించారు. ఇక మరో కొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ ముగ్గురికీ గేమ్‌ఛేంజర్ ఫలితం అత్యంత ముఖ్యం. ఎందుకంటే?
ఎన్టీఆర్ సాధించాడు, మరి రామ్‌చరణ్?
దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరో హిట్ కొట్టడం కష్టమని ఇండస్ట్రీలో వినిపించే మాట. అది చెర్రీకి కూడా అనుభవం. 'మగధీర' తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన 'ఆరెంజ్' అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక 'ఆర్ఆర్ఆర్'లో రామ్‌చరణ్ రామరాజుగా అద్భుతంగా అలరించారు. ఈ సినిమా తర్వాత రామ్‌చరణ్ 'ఆచార్య' (చిరంజీవితో కలిసి)లో నటించారు. ఈ సినిమా కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది.
అయితే రాజమౌళి సినిమా తర్వాత రామ్‌చరణ్ సోలో సినిమా 'గేమ్‌ఛేంజర్'. అందుకే రాజమౌళి మిత్ బ్రేక్ చేయాలంటే చరణ్ ఈ సినిమాతో విజయం అందుకోవాల్సిందే. 'ఆర్ఆర్ఆర్' లో నటించిన మరో స్టార్ హీరో ఎన్టీఆర్ రీసెంట్గా ఈ మిత్ బ్రేక్ చేశారు. ఆయన హీరోగా నటించిన 'దేవర' గతేడాది మంచి విజయం సాధించింది. మరి రామ్‌చరణ్ 'గేమ్‌ఛేంజర్'తో ఫలితం అందుకుంటారా? చూడాలి.
శంకర్‌కు కూడా
విజనరీ డైరెక్టర్ శంకర్ కొన్ని రోజులుగా సరైన హిట్ కొట్టలేకపోతున్నారు. దర్శకుడు శంకర్ సినిమా అంటే చాలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌నకు సోషల్ మెసేజ్ జోడించి సినిమా తెరకెక్కింటడంలో శంకర్ దిట్ట. 'జెంటిల్‌మెన్' నుంచి రాబోయే 'గేమ్ ఛేంజర్' వరకూ ఆయన సినిమాల్లో అది క్లియర్‌గా కనిపిస్తుంది.