Gaami Telugu Review : చిత్రం : గామి, నటీనటులు : విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, హారిక, దయానంద్ రెడ్డి, మహమ్మద్ సమద్, శాంతి రావు, మయాంక్ పరాక్, శ్రీధర్ తదితరులు. కూర్పు: రాఘవేంద్ర, సంగీతం: స్వీకర్ అగస్తీ, నరేష్ కుమారన్, ఛాయాగ్రహణం: విశ్వనాథ్ రెడ్డి, రాంపీ, స్టోరీ, డైరెక్షన్: విద్యాధర్ కాగిత, నిర్మాత: కార్తీక్ శబరీష్.
ఇటీవలి కాలంలో విడుదలకు సిద్ధంగా ఉన్నసినిమాల్లో అందరి దృష్టి ఆకర్షిస్తోంది 'గామి' మూవీ. విశ్వక్ సేన్, చాందినీ చౌదరీ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఎట్టకేలకు శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే ?
కథేంటంటే :
శంకర్ (విశ్వక్ సేన్) ఓ అఘోరా. అతనెవరో, తన గతమేంటో అతడికి అస్సలు గుర్తుండవు. పైగా మానవ స్పర్శను నోచుకోలేని ఓ అరుదైన వ్యాధితో శంకర్ బాధపడుతుంటాడు. దీంతో తోటి అఘోరాలంతా తనని శాపగ్రస్థుడు అనుకుని ఆశ్రమం నుంచి అతడ్ని వెలివేస్తారు. ఈ క్రమంలో తనని తాను తెలుసుకునేందుకు శంకర్ అన్వేషణ మొదలు పెడతాడు. తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వత శ్రేణుల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాల్లో ఉందంటూ ఓ స్వామీజీ చెప్పిన మాటల ద్వారా తెలుసుకుంటాడు. అయితే అక్కడికి చేరుకోవాలంటే ఎన్నో ప్రమాదాలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. అయినప్పటికీ వాటన్నింటినీ లెక్క చేయకుండా డాక్టర్ జాహ్నవి (చాందిని చౌదరి)తో కలిసి అక్కడికి బయలుదేరుతాడు శంకర్. ఆ తర్వాత వారి ప్రయాణం ఏమైంది? మాలిపత్రాలు సాధించే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? దేవదాసి దుర్గ (అభినయ) కూతురు ఉమ (హారిక), సీటీ 333 (మహమ్మద్)ల జ్ఞాపకాలు అతడ్ని ఎందుకు వెంటాడుతుంటాయి? వాళ్లతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే
ఎలా సాగిందంటే :
"కొత్తదనం నిండిన కథలను చూడాలనుకునే ఆడియెన్స్‌కు ఈ సినిమా మంచి సంతృప్తినిస్తుంది". అని ఇటీవలే ఓ ప్రమోషనల్ ఈవెంట్లో విశ్వక్ చెప్పిన మాటలివి. స్క్రీన్‌పై ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు నిజంగా అదే అనుభూతి కలుగుతుంది. డైరెక్టర్ కథను ఆరంభించిన తీరు, దాన్ని మూడు జీవిత కథలుగా చూపిస్తూ చిత్రాన్ని ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లిన విధానం చివరిలో వాటన్నింటినీ ఒకదానితో ఒకటి ముడిపెట్టిన పద్ధతి ఇలా అన్ని అంశాలు ప్రేక్షకుడిని ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. ముగింపు సన్నివేశాలను చూసినప్పుడు కచ్చితంగా 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా గుర్తుకువస్తుంది.
శంకర్‌గా విశ్వక్‌ను పరిచయం చేస్తూ సినిమాను ఆరంభించిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తోటి అఘోరాలంతా తనపై దాడికి ప్రయత్నించడం, ఆ తర్వాత కుస్తీ పోటీ అందులో తలపడుతున్న శంకర్‌కు మానవ స్పర్శ తగిలి తన శరీరంలో వచ్చే మార్పులు. ఇవన్నీ శంకర్ గతంపై ఆసక్తి కలిగించేలా చేస్తాయి. ఆ వెంటనే దేవదాసి దుర్గ కథ ప్రారంభం అవుతుంది. ఇక ఈ ఎపిసోడ్‌లో దేవదాసి వ్యవస్థను చూపించిన తీరు కూడా అందరినీ మెప్పిస్తుంది.
దుర్గ కూతురు ఉమ కథే ఈ చిత్రానికి మూలంగా నిలిచింది. వీళ్ల జీవితాల్లోని సంఘర్షణ కూడా ప్రేక్షకుల మదిని బలంగా తాకుతుంది. ఇక మనుషులపై జరిగే అక్రమ వైద్య ప్రయోగాల నేపథ్యంలో వచ్చే స్టోరీలు కూడా ఉత్కంఠభరితంగానే ఉంటుంది. సీటీ 333 పై జరిగే ప్రయోగాలు, అలాగే అతడిని బంధించి ఉంచిన ప్రపంచం అక్కడి నుంచి పారిపోవడానికి చేసే ప్రయత్నాలు ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉంటాయి.
ద్రోణగిరి పర్వత శ్రేణులకు చేరుకునే క్రమంలో శంకర్ - జాహ్నవి చేసే సాహసోపేతమైన ప్రయాణం ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్స్ కొన్ని సెకెండాఫ్‌పై అంచనాలు పెంచుతాయి. ఆ తర్వాత స్టోరీ కాస్త సాగతీతగా అనిపిస్తుంది. ఉమను బలవంతంగా దేవదాసిగా మార్చేందుకు ఆ ఊరి సర్పంచ్ వేసే ఎత్తుగడ ఈ క్రమంలో తప్పించుకునేందుకు ఆ చిన్నారి చేసే ప్రయత్నాలు చ బాగుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సింహం సీక్వెన్స్ ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే :
Gaami Movie Cast : అఘోరా పాత్రలో విశ్వక్ చక్కగా నటించారు. ఎమోషనల్ సీన్స్‌లో ఒదిగిపోయారు. సీటీ333 పాత్రలో మహమ్మద్, ఉమ పాత్రలో హారిక యాక్టింగ్ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. తన పాత్ర కోసం చాందిని కష్ట పడిన తీరు తెరపై కనిపిస్తుంది. దేవదాసిగా దుర్గ పాత్రలో అభినయ నటన ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటుంది.
డైరెక్టర్ ఈ కథను తీర్చిదిద్ది, తెరపైకి తీసుకొచ్చిన విధానం బాగుంది. అయితే స్టోరీలోని కొన్ని సీన్స్ లాజిక్‌కు దూరంగా ఉంటాయి. మనుషులపై జరుగుతున్న అక్రమ వైద్య పరిశోధనల నేపథ్యంలో వచ్చే కొన్ని ఎపిసోడ్స్ కాస్త కన్ఫ్యూజన్గా ఉంటాయి. తన సినిమాటోగ్రఫీతో విశ్వనాథ్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. నరేష్ కుమారన్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచింది. "శివమ్" పాటను సినిమాలో చూపించిన తీరు బాగుంది. పరిమిత బడ్జెట్‌లోనే మేకర్స్ మంచి గ్రాఫిక్స్ వర్క్‌ను చూపించారు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు: