Prabhas Spirit Movie Update :రెబల్ స్టార్ ప్రభాస్- స్టార్ డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్లో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ 'స్పిరిట్'. యాక్షన్ మోడ్లో రూపొందనున్న ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే డిసెంబర్ చివర్లో లేదా వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం ప్రకటించింది. అయితే దీపావళి సందర్భంగా సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఇది నెటిజన్లను అదేంటంటే?
'స్పిరిట్' సాలిడ్ అప్డేట్- మూవీ పనులు షురూ
ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'స్పిరిట్' నుంచి మరో కీలక అప్డేట్
Prabhas Spirit Movie Update (Source: Getty Images)
Published : 5 hours ago
'స్పిరిట్' సినిమాకు సంబంధించి మ్యూజిక్ పనులు ప్రారంభంమయ్యాయి. ఈ మేరకు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ వెల్లడించారు. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అందులో హర్షవర్ధన్, సందీప్ ట్యూన్స్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.