Famous Celebrities Divorce:ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు.. ప్రస్తుతం ఇవి సాధారణం అయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా కొన్నాళ్లకు విడిపోతున్న పరిస్థితి. అందులోనూ సెలబ్రిటీల విడాకుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. తాజాగా.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో నాలుగేళ్ల బంధానికి స్వస్తి పలికినట్లు ప్రకటించారు. 2020లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. 2024లో విడిపోయారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా విడాకుల నేపథ్యంలో.. ఇప్పటి వరకు విడాకులు తీసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖుల గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. మరి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..
అమీర్ ఖాన్ - కిరణ్ రావు:అమీర్ ఖాన్.. మొదటి భార్యతో విడాకుల తర్వాత.. డిసెంబరు 28, 2015న కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వారికి ఆజాద్ రావు ఖాన్ అనే అబ్బాయి ఉన్నాడు. 16 సంవత్సరాల వివాహ బంధం తర్వాత 2021లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు.
శిఖర్ ధావన్ - ఆయేషా ముఖర్జీ:ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని ధావన్ 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడున్నారు. అయితే, వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2020 నుంచి దూరంగా ఉంటున్నారు. ధావన్ నుంచి తాను విడిపోతున్నట్లు 2021లో ఆయేషా ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది. ఆమెకు అంతకు ముందే పెళ్లి అయి భర్త నుంచి విడిపోయింది. మొదటి భర్త ద్వారా ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు.
మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్:అర్బాజ్ ఖాన్, నటి మలైకా అరోరా 1998లో వివాహం చేసుకున్నారు. వారికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు 2002లో జన్మించాడు. ఈ జంట 28 మార్చి 2016న విడిపోతున్నట్లు ప్రకటించారు. 11 మే 2017న అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
హృతిక్ రోషన్ - సుసానే ఖాన్:హృతిక్, సుస్సేన్ 20 డిసెంబర్ 2000న వివాహం చేసుకున్నారు. 14 సంవత్సరాల వివాహం తర్వాత.. ఈ జంట 2014లో పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నారు.
విడాకులు తీసుకున్న మరో స్టార్ సెలబ్రిటీ కపుల్ - 11ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి
కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్: కరిష్మా, సంజయ్ 2003లో వివాహం చేసుకున్నారు. అనేక విభేదాలు, ఆరోపణల కారణంగా.. ఈ జంట 2014లో అధికారికంగా విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.