తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అందుకే #90s మిడిల్​ క్లాస్​ భారీ సక్సెస్ - ఇక ఆ పాత్రలు చేయాలనుకుంటున్నా : శివాజీ - బిగ్​బాస్ శివాజీ కొత్త సినిమాలు

ETV Win 90s middle class biopic Sivaji : '#90's ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌'లో తాను నటించడానికి అసలు కారణం తెలిపారు నటుడు శివాజీ. ఈ సిరీస్​ ఎందుకు విజయం సాధించిందో వివరించారు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2024, 6:57 AM IST

Updated : Jan 20, 2024, 7:03 AM IST

ETV Win 90s middle class biopic Sivaji : "ఇండియన్‌ ఓటీటీలో వచ్చిన అన్ని వెబ్‌ సిరీసుల్లో టాప్‌-5లో ఉండదగ్గ వెబ్‌సిరీస్‌ '#90's ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌' అని అన్నారు నటుడు శివాజీ. ఆయన వాసుకి ఈ సిరీస్​లో ప్రధాన పాత్రలు పోషించారు. ఆదిత్య హాసన్‌ దర్శకుడు. రాజశేఖర్‌ మేడారం నిర్మాతగా వ్యవహరించగా నవీన్‌ మేడారం సమర్పించారు. మౌళి, వాసంతిక, రోహన్‌ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. రీసెంట్​గా 'ఈటీవీ విన్‌'లో రిలీజైన ఈ సిరీస్‌ విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సందర్భంగా సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది టీమ్​.

ఆ పాత్రలు చేయాలనుకుంటున్నా : ఒక నటుడిగా చాలా రకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చి నెల రోజులైపోయింది. ఇప్పటివరకు ఎనిమిది స్క్రిప్ట్‌లు విన్నాను. అన్నీ రొటీన్‌గా అనిపించాయి. కామెడీ స్క్రిప్ట్​ను ఓకే చేశాను. విలన్‌గా కూడా నటిస్తున్నాను. ఈటీవీ విన్‌లో (ETV Win #90s webseries) రావడం వల్లే ఈ #90s సిరీస్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈటీవీ ఓ ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌. అందులో వచ్చింది కాబట్టే ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. 15 రోజుల్లోనే 5 లక్షల సబ్‌స్క్రైబర్లు వచ్చారు. వేరే ఏదైనా కొత్త ప్లాట్‌ఫామ్‌ అయితే ఇలా జరిగేదా?

అందుకే సెక్సెస్​ : కంటెంట్‌ వల్లే ఈ సిరీస్​ విజయం సాధించింది. డైలీ లైఫ్​లో మనకు ఎన్నో టెన్షన్స్‌. వాటి నుంచి రిలాక్స్‌ అవ్వడానికి టీవీ ఒక ప్లాట్​ఫామ్​. క్రైమ్‌ థ్రిల్లర్స్‌ కాకుండా మంచి ఫన్ ఎంటర్​టైన్మెంట్​ అందించే వాటిని చూడాలనుకుంటాము. క్రైమ్‌ థ్రిల్లర్స్‌ క్రియేట్‌ చేయడం సులభమే కానీ జీవితాన్ని స్క్రీన్‌పైకి తీసుకురావడం అద్భుతంగా ఉంటుంది. కంటెంట్‌ బాగుంటే ప్లాట్‌ ఫామ్‌ కొత్తదా పాతదా అనేది ప్రేక్షకులు చూడరు. తప్పకుండా ఆదరిస్తారు. ఎన్ని తరాలైనా ఇండియాలో ఫ్యామిలీ కంటెంట్‌కు వచ్చే సక్సెస్‌ ఇంకా దేనికి రాదు.

అందుకే ఈ సిరీస్​లో నటించా : వెబ్‌సిరీస్‌లో చూపించినట్టుగా మార్కుల విషయంలో మా పిల్లలతో అలా ఉండను. జనరేషన్‌ మారింది. చిన్నప్పుడు సరిగ్గా చదవకపోతే మా నాన్న కొట్టేవారు. ప్రస్తుతం తల్లిదండ్రులెవరూ తమ పిల్లలతో అలా వ్యవహరించడం లేదు. మా పిల్లలతో నేను చాలా క్లోజ్​గా ఫ్రెండ్లీగా ఉంటాను. అసలు ఈ ప్రాజెక్ట్‌ చేయడానికి మెయిన్ రీజన్​. ఆదిత్య(సిరీస్‌లో శివాజీ చిన్న తనయుడు) పాత్ర. నా చిన్న కొడుకు కూడా అంతే సరదాగా ఉంటాడు. బాగా చదువుతాడు. తల్లిదండ్రులు కోప్పడ్డారు, కొట్టారు అనే వాటిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సమాజంలో తండ్రి పాత్రకు ఎంతో విలువ ఉంది. ఆయన ఏం చెప్పినా అది బాధ్యతతోనే చెబుతారు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతారో మనం తండ్రి అయ్యాకే తెలుస్తుంది.

ETV WIN బంపర్ ఆఫర్- బ్లాక్ బస్టర్​ హిట్​ '90s మిడిల్ క్లాస్' ఫ్రీగా చూడండిలా

ETV WIN బంపర్ ఆఫర్- బ్లాక్ బస్టర్​ హిట్​ '90s మిడిల్ క్లాస్' ఫ్రీగా చూడండిలా

Last Updated : Jan 20, 2024, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details