India's Most liked Webseries 90s MiddleClass Biopic :ఓటీటీలో వచ్చాక ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. టాలెంట్‌ను నిరూపించుకునేందుకు ఈ ప్లాట్‌ఫామ్ ఎంతో మందికి ఉపయోగపడుతోంది. ఆడియెన్స్ కూడా కాస్ట్ కన్నా కూడా కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. అందుకే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు, సిరీస్‌లు ఇందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
అలా ఆ మధ్య చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఆకట్టుకున్న వెబ్ సిరీస్ #90s మిడిల్ క్లాస్ బయోపిక్. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఇది రిలీజైన రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రతిఒక్కరినీ మెప్పించింది. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసింది. వ్యూస్ పరంగా పలు రికార్డులను క్రియేట్ చేసింది.
అయితే ఇప్పుడీ సిరీస్ మరో సరికొత్త రికార్డును సాధించింది. 2024 ఫస్ట్ హాఫ్‌లో దేశవ్యాప్తంగా అత్యధిక మంది లైక్ చేసిన తెలుగు సిరీస్‌గా నిలిచింది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, సిరీస్‌లను విశ్లేషించి వాటికి రేటింగ్స్ ఇచ్చే ఆర్మాక్స్ సంస్థ ఈ విషయాన్ని తెలిపింది.