ETV Ugadi Special Promo :ఉగాది పండగ కోసం ఎప్పుడూ స్పెషల్ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసే ఈటీవీ ఈ సారి కూడా సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ముందుకు రానుంది. తాజాగా ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజైంది.
ఇందులో భాగంగా తాజాగా విడుదలైన ప్రోమో నెటిజన్లు తెగ ఆకట్టుకుంది. అందులో 'బలగం' మూవీ టీమ్‌తో పాటు #90s వెబ్ సిరీస్ స్టార్స్ కూడా వచ్చి సందడి చేశారు. ఫన్నీ కంటెంట్‌తో అలరించారు. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా 'ఫ్యామిలీ స్టార్' మూవీ టీమ్ ఈ ఈవెంట్‌కు హాజరై ఫ్యాన్స్‌కు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో పాటు మృణాల్ ఠాకూర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఈ ప్రొగ్రామ్‌లో సందడి చేశారు.
సరదాగా ఆటలు ఆడి, తమ సినిమా పాటకు డ్యాన్సులు వేసి అక్కడి వారికి జోష్ తెప్పించారు. ఈ సంధర్భంగా పెళ్లి కాని వాళ్లకు ఏదైనా టిప్స్ ఇవ్వమని యాంకర్ సుధీర్ రౌడీ బాయ్‌ను అడగ్గా, దానికి విజయ్ నవ్వుతూ "నా లవ్ స్టోరీ కంటే నీ లవ్ స్టోరీ రోజూ న్యూస్‌లో ఉంటదిగా" అంటూ సుధీర్ మీద నవ్వుతూ పంచ్ వేశారు. ఇది విని అక్కడున్నవారంతా కడుపుబ్బా నవ్వారు.