Dulquer Salmaan Lucky Bhaskar OTT Release : మాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దీన్ని తెరకెక్కించారు. దీపావళి కానుకగా రీసెంట్గా బాక్సాఫీస్ ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్స్‌లో సాలిడ్ రన్‌ను కంటిన్యూ చేసి మంచి విజయాన్ని సాధించింది. అలాగే భారీ వసూళ్లను కూడా అందుకుంది. దాదాపు రూ.30 కోట్లతో తెరకెక్కిన ‘ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. దుల్కర్ కెరీర్‌లో రూ.100కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమా ఈ లక్కీ భాస్కరే.
అయితే ఇపుడు మళ్లీ వీకెండ్ సందర్భంగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసిందీ లక్కీ భాస్కర్. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అందులోనే ఇప్పుడు స్ట్రీమింగ్కు వచ్చింది. పాన్ ఇండియా అన్ని భాషల్లో అందుబాటులో ఉంది. కాబట్టి థియేటర్లలో మిస్ అయినా వారు, లేదంటే మరోసారి ఈ చిత్రాన్ని చూడాలనుకునేవారు ఎంచక్కా ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా కలిసి నిర్మించారు.