Double Ismart Twitter Review:ఉస్తాద్ రామ్- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన 'డబుల్ ఇస్మార్ట్' గురువారం రిలీజైంది. రామ్ ఫ్యాన్స్, ప్రేక్షుకులు ఎంతగానో ఎదురుచూసిన థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్ లభించింది. దీంతో సినిమా అంచనాలు కూడా పెరిగిపోయాయి. మరి రామ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉంది. డైరెక్షన్లో పూరి మార్క్ కనిపించిందా?
గురువారం తెల్లవారుజామునే డబుల్ ఇస్మార్ట్ ప్రీమియర్ షోస్ పడ్డాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఆడియెన్స్ రాకతో హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో సందడి నెలకొంది. ఇక ఈ సినిమాకు అంతటా ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ రివ్యూ వస్తోంది. హీరో రామ్ క్యారెక్టరైజేషన్, పూరి మార్క్ డైరెక్షన్ ఆకట్టుకుంటాయని అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ సినిమాకు ప్లస్‌గా మారిందట.
హీరో రామ్ ఎనర్జీ, డ్యాన్స్‌లు, ఎంటర్టైనింగ్ డైలాగులు, సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు పడ్డాయి. స్టెప్పా మార్, మార్ ముంత పాటలతో ఆడియెన్స్‌కు మంచి హైప్ ఇచ్చారంట. అయితే సినిమాలో బీజీఎమ్ (BGM) అంతగా ఆకట్టుకోదలని టాక్. అలీ కామెడీ, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్ట్, స్క్రీన్ ప్లే కూడా కాస్త నిరాశ పర్చాయని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. చిన్న చిన్న అంశాలు మినహా, ఓవరాల్‌గా సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు. చాలా రోజులకు రామ్ మాస్ యాక్షన్ తెరపై చూడొచ్చని టాక్.