తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చెర్రి ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్- RC16 అప్డేట్- ఏంటంటే? - RC 16 MOVIE UPDATE

RC 16 చిత్రం అప్డేట్- ఫుల్​ స్వింగ్​లో షూటింగ్- ఫొటో ఔట్

RC 16 Movie Update
RC 16 Movie Update (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 24 hours ago

RC 16 Movie Update :గ్లోబల్ స్టార్ రామ్​చరణ్ - బుచ్చిబాబు సానా కాంబోలో 'ఆర్‌సీ 16' (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్​ షేర్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ మైసూర్​లో జరుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు షూటింగ్ సెట్​లోని ఓ ఫొటో షేర్ చేశారు.

రత్నవేలు పోస్ట్ చేసిన ఫొటో చూస్తుంటే రాత్రి వేళల కూడా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 'మైసూర్​లో జరుగుతున్న RC16 షూటింగ్​లో భాగంగా, 'రంగస్థలం' తర్వాత రామ్​చరణ్​తో కలిసి పనిచేస్తున్నా. మంచి టీమ్​తో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది' అని పోస్ట్​కు రాసుకొచ్చారు. అయితే రత్నవేలు లాంటి సినిమాటోగ్రాఫర్‌ ఆర్​సీ 16కు పనిచేడయం వల్ల ఫ్యాన్స్​లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఎట్టకేలకు ఈ సినిమా నుంచి అప్డేట్ రావడం వల్ల కూడా ఫ్యాన్స్​ కూడా సంతోష పడుతున్నారు.

కాగా, తన తొలి సినిమా 'ఉప్పెన'తోనే డైరెక్టర్​ బుచ్చిబాబు జాతీయ పురస్కారం దాకా వెళ్లారు. ఇది 2023 ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. దీంతో ఈ ప్రాజెక్ట్​పై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం బుచ్చిబాబు దాదాపు రెండేళ్ల నుంచి వర్క్‌ చేస్తున్నారు. స్పోర్ట్స్‌ డ్రామాగా, గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది.

ఇందులో రామ్‌చరణ్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్‌ హీరోయిన్​గా నటించనుంది. కన్నడ స్టార్ నటుడు శివరాజ్​కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు సైతం అయ్యాయని టాక్. ఇక మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, వృద్ధి సినిమాస్‌ సంస్థలు కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.

RC16 షూటింగ్ అప్డేట్​ - ఆ రోజు నుంచే ప్రారంభం! - RC 16 Movie Shooting Update

RC 16 సూపర్ అప్డేట్​ ఇచ్చిన ఏఆర్​ రెహమాన్!​ - ఏంటంటే?

ABOUT THE AUTHOR

...view details