Kalki 2898 AD Nag Ashwin :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ. ఈ సినిమా నిర్మాత స్వప్నదత్ తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్‌తో జరిగిన సరదా సంభాషణను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. "కల్కి సీజీ వర్క్ చేసే వారందరూ ఓటేయడానికి హైదరాబాద్ నుంచి వాళ్ల స్వస్థలాలకు వెళ్లిపోయారు. మరి ఇప్పుడెలా" అంటూ నాగ్ అశ్విన్ అడగగా - 'ఎవరు గెలుస్తారేంటి' అని స్వప్న తిరిగి ప్రశ్నించారు. అందుకు ఆయన సరదాగా బదులిచ్చారు. "ఎవరు గెలిస్తే నాకెందకు నా సీజీ షాట్స్ ఎప్పుడు వస్తాయో ఏమో అని ఎదురుచూస్తున్నాను" అని పేర్కొన్నారు. దీంతో కల్కి గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.
అయితే వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రాన్ని జూన్ 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. రీసెంట్‌గానే ఈ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ కూాడా చేశారు. దీంతో ఈలోగా ఎలాగైనా మిగిలి ఉన్న పనిని త్వరగా పూర్తి చేయాలని మూవీ యూనిట్ గట్టిగా ప్రయత్నిస్తుంది.