Devara VS Thandel : ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా దేవర. వేసవి కానుకగా ఏప్రిల్‌లో రావాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల దసరా బాక్సాఫీస్‌కు రానుంది. అక్టోబర్ 10న సినిమా విడుదల కానుంది. అయితే దేవర చిత్రం ఈ కొత్త రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకోవడంతో బాక్సాఫీస్ ముందు కొత్త పోరు తెరలేచెే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో 'దేవర'తో పోటీపడేందుకు నాగచైతన్య సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది.
వివరాల్లోకి వెళితే. అక్కినేని నాగచైతన్య చాలా రోజులుగా ఫ్లాపుల్లో ఉన్న సంగతి తెలిసిందే. బంగార్రాజు తర్వాత ఆయన మరో హిట్ అందుకోలేదు. థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్ధా, కస్టడీ వంటి చిత్రాలు వరుసగా డిజాస్టర్లుగా నిలిచాయి. అయితే రీసెంట్గా ఓటీటీలో వచ్చిన దూత వెబ్ సిరీస్ మాత్రం మంచి సక్సెస్ అందుకుంది. దీంతో ఆచితూచి ఎలాగైన సరైన థియేటర్ హిట్ అందుకోవాలని తండేల్ కథను ఎంచుకున్నారు చైతూ.
రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో చందు మొండేటి దీన్ని తెరకెక్కిస్తున్నారు. చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా ఈ తండేల్ రూపొందుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. గుజరాత్ సూరత్‌లోని ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఇది తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగనుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుందట. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని దసరా సమయంలోనే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ దసరాకి బాక్స్ ఆఫీస్ దగ్గర 'దేవర' వర్సెస్ 'తండేల్' సినిమాల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరో విశేషమేంటంటే ఈ రెండు సినిమాలు సముద్రం బ్యాక్ డ్రాప్‌తోనే వస్తున్నాయి.