Devara Pre Release Event:యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు యావత్ సినీ లోకమంతా ఆశగా ఎదురుచూస్తున్న సినిమా 'దేవర'. భారీ అంచనాలతో ముస్తాబైన ఈ సినిమా రిలీజ్ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుండగా, దానికి ముందు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఈవెంట్‌కు హాజరై తారక్ మాట్లాడే మూమెంట్ కోసం ఆయన అభిమానులు తహతహలాడుతున్నారు. ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ ప్లేస్, డేట్ ఫిక్స్ చేశారు మూవీ యూనిట్.
ఈ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో సెప్టెంబర్ 22 (ఆదివారం) నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కానీ, దాదాపు ఇది నిజమేనని సనీవర్గాల టాక్. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్, టీజర్, పాటలు, ట్రైలర్ ఫ్యాన్స్‌కు మంచి కిక్కిచ్చాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ మాటలు విని థియేటర్‌కు వెళ్లిపోయేందుకు ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. తొలి పార్ట్‌లో తారక్ సరసన అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇందులో తారక్ ద్విపాత్రాభినయం (డ్యూయెల్ రోల్) చేస్తున్నారు. భారీ తారాగణంతో పాటు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాక్కో, టెంపర్ వంశీ, మురళీ శర్మ నటిస్తున్నారు. యువ సుధ ఆర్ట్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాకు సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు.