తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'దేవర' రోర్​ - ట్రైలర్ రాకుండానే వన్ మిలియన్ టికెట్స్ సోల్డ్​! - ఆ ఘనత సాధించిన తొలి సినిమాగా! - Devara Movie USA Pre Sales - DEVARA MOVIE USA PRE SALES

Devara Movie USA Pre Sales : జూనియర్ ఎన్​టీఆర్ 'దేవర' మూవీ యూఎస్ అడ్వాన్స్​ బుక్కింగ్స్​లో తాజాగా ఓ నయా రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆ వివరాలు మీ కోసం.

Devara Movie USA Pre Sales
Jr NTR (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 11:35 AM IST

Devara Movie USA Pre Sales :జూనియర్ ఎన్​టీఆర్ 'దేవర' మూవీ రిలీజ్​కంటే ముందే అనేక రికార్డులను సాధించి ఫుల్ ట్రెండింగ్​లో ఉంది. తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్‌లో ఈ మూవీ ప్రీసేల్‌ టికెట్‌ బుకింగ్స్​లో వన్‌ మిలియన్‌ సేల్ చేసింది. ఈ క్రమంలో నార్త్‌ అమెరికన్‌ బాక్సాఫీస్‌ వద్ద అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారా వన్‌ మిలియన్‌ మార్క్‌ దాటిన సినిమాగా రికార్డుకెక్కింది.

ఇదిలా ఉండగా, ట్రైలర్‌ కూడా రిలీజ్ అవ్వకముందే ప్రతిష్టాత్మక వన్ మిలియన్‌ క్లబ్‌లో చేరిన తొలి భారతీయ చిత్రంగానూ ఇది చరిత్రకెక్కింది. అయితే ట్రైలర్ రిలీజ్‌ అయ్యాక ఈ సంఖ్య మరింత పెరిగే అనేక రికార్డులు నెలకొల్పే అవకాశముందని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

ట్రైలర్‌ ఎప్పుడంటే?
దేవర సినిమా పక్కా యాక్షన్‌ డ్రామాగా ముస్తాబవుతోంది. అయితే ఈ మూవీ ట్రైలర్​ను రేపు(సెప్టెంబర్ 10) రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ అఫీషియల్​గా అనౌన్స్ చేసింది. సెప్టెంబర్‌ 10 సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఓ స్పెషల్ పోస్టర్​ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో తారక్​ పవర్​ఫుల్​గా కనిపిస్తున్నారు. కత్తి పట్టుకొని సముద్రంలో నడుస్తున్నట్లు కనిపించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్​ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సందీప్‌రెడ్డి వంగాను కలిసిన తారక్
అయితే తాజాగా 'దేవర' మూవీ ప్రమోషన్స్​లో భాగంగా ముంబయి వెళ్లారు జూనియర్ ఎన్​టీఆర్​. అక్కడ ఆయన 'యానిమల్' డైరెక్టర్ సందీప్‌ వంగాను కలిశారు. ఇక ఆయనతో సరదాగా ముచ్చటిస్తున్న సమయంలో తీసిస ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇది చూసి ఫ్యాన్స్​, సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం సందీప్ వంగా ప్రభాస్​ స్పిరిట్‌ కోసం రెడీ అవుతున్నారు. దీని తర్వాత ఎన్​టీఆర్ సినిమా చేసే అవకాశముందని కొంతమంది అనుకుంటున్నారు. మరికొందరేమో 'దేవర' ప్రమోషన్‌ భాగంగా సందీప్‌ వంగా ఈ టీమ్‌ను ఇంటర్వ్యూ చేయనున్నారని కామెంట్ చేస్తున్నారు.

ఓవర్సీస్​లో 'దేవర' మేనియా- 6 నిమిషాల్లోనే ప్రీ బుకింగ్స్ సోల్డ్​ ఔట్! - Devara Overseas Pre Sales

దేవర వీడియో సాంగ్​కు యమదొంగ ఆడియో - సింక్​ భలే సెట్​ అయింది! - Devara Chuttamalle Song

ABOUT THE AUTHOR

...view details