Devara Promotions Janhvi Kapoor Saree : యంగ్ టైగర్ ఎన్టీఆర్, అతిలోక సుందరి జాన్వీ కపూర్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తాజాగా ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో దేవరపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మూవీటీమ్ కూడా జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ కూడా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
అయితే ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఈవెంట్ కోసం జాన్వీ కపూర్ చీరలో దర్శనమిచ్చింది. ఎంబ్రాయిడరీ బ్లౌజ్, పింక్ కలర్ శారీలో మెరిసిపోయింది. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అదిరే పోజులు ఇచ్చింది.
దీంతో ఆ పిక్స్ తెగ వైరల్ అయ్యాయి. అది చూసిన నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అయిపోయారు. అదే సమయంలో ఆమె ధరించిన గులాబీ రంగు చీర, ఇయర్ రింగ్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. దీంతో వాటి ధర ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ చీర ఖరీదు అక్షరాల రూ. 1,24,850 అని పోస్ట్ చేస్తున్నారు. అలాగే ఆ చీరకు పెయిర్ అప్‌గా చెవులకు జాన్వీ పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ధర రూ. 13 లక్షలు అని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం తెలుసుకుంటున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.