తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాక్సాఫీస్ వద్ద 'దేవర' రోర్​ - ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందంటే? - Jr NTR Devara Movie - JR NTR DEVARA MOVIE

Devara Box Office Collection : మ్యాన్ ఆఫ్​ మాసెస్ జూనియర్​ ఎన్​టీఆర్ లేటెస్ట్ మూవీ 'దేవర'​ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఇప్పటివరకూ ఎంత వసూలు చేసిందంటే?

Devara Box Office Collection
Devara Box Office Collection (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2024, 12:48 PM IST

Devara Box Office Collection :జూనియర్ ఎన్​టీఆర్ 'దేవర' మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అటు క్లాస్​తో పాటు ఇటు మాస్ ఆడియెన్స్​ను అలరిస్తున్న ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ.396 కోట్లకు మేర వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ టీమ్​ తాజాగా ఓ సాలిడ్​ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇది చూసిన తారక్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. వీకెండ్స్​, పండుగ సెలవుల నేపథ్యంలో మరింత కలెక్షన్ వచ్చే అవకాశాలున్నాయని తెలుపుతున్నారు.

థియేటర్​లో ఆ సీన్స్​కు ఫుల్ క్రేజ్

Devara Movie Cast : ఇక 'దేవర' సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటించారు. తంగం అనే పాత్రలో ఆమె చాలా నేచురల్​గా యాక్ట్ చేశారు. సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్​గా నటించారు. ఎన్​టీఆర్ డ్యుయల్ రోల్​లో కనిపించి అభిమానులను అలరించారు. సీనియర్ నటుడు శ్రీకాంత్, మరాఠి స్టార్ శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు ఈ చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనిరుధ్ రవిచంద్రన్ సాంగ్స్, బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్​గా నిలిచిందని అభిమానులు అంటున్నారు.

ఇదే కాకుండా తారక్ ఎంట్రీ సీన్​ ఎలివేష‌న్స్‌, స‌ముద్రం బ్యాక్​డ్రాప్​ గొప్ప థియేట్రిక‌ల్ అనుభూతిని పంచుతుందని అంటున్నారు. దేవ‌ర‌, భైర ఆ రెండు పాత్ర‌ల్ని అత్యంత శ‌క్తిమంతంగా తెర‌పై ఆవిష్క‌రించారని, ఇద్దరి మ‌ధ్య సాగే భీకర పోరాటం, సహా ఇతర స‌న్నివేశాలను అద్భుతంగా చూపించారని సినీ విశ్లేషకలు అంటున్నారు. ఇక ఫియ‌ర్ సాంగ్‌, యాక్షన్ సీన్స్​, ఇంటర్వెల్ సీన్స్​ మ‌రో స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. మొత్తంగా ఫస్ట్​ హాఫ్​లో ఎర్ర స‌ముద్రం క‌థ‌, దేవ‌ర‌, భైర‌వ పాత్ర‌లు, యాక్షన్ సీన్స్​, సాంగ్స్​ ఇలా అన్ని సూపర్​గా ఉన్నాయని నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు.

'దేవర' సక్సెస్​ మీట్​ - సెలబ్రేషన్స్​ కోసం తారక్ కూడా వెయిటింగ్ అంట! - Devara Success Meet

బ్లాక్ బస్టర్ 'దేవర' - OTTలోకి ఎన్ని రోజుల తర్వాత, ఎక్కడ వస్తుందంటే? - Devara Movie OTT Details

ABOUT THE AUTHOR

...view details