Deepika Padukone Pregnant : బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్ - దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2018లో ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా దీపిక తల్లి కాబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై రణ్‌వీర్, దీపిక స్పందించలేదు. తాజాగా, దీపికా పదుకొణె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. తాను రణ్‌వీర్ సింగ్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 2024లో డెలివరీ కానున్నట్లు హింట్ ఇచ్చింది. ప్రస్తుతం దీపిక పెట్టిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అది చూసిన ఫ్యాన్స్, సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తొలిసారి అప్పుడే : 2013లో రిలీజై సూపర్ హిట్ అందుకున్న రామ్ లీలా చిత్రంలో రణ్‌వీర్ - దీపికా పదుకొణె తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే దీపిక - రణ్‌వీర్ ప్రేమలో పడ్డారు. 2018, నవంబర్‌లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అలా తమ ప్రేమను శాశ్వతమైన అనుబంధంగా మార్చుకున్నారు. ఆ తర్వాత చాలా సార్లు ఈ ఇద్దరు విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ జంట మాత్రం ప్రతి సందర్భంలోనూ తాము కలిసే ఉన్నట్లు తమ చర్యలతో చెప్పుకొచ్చారు.
ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాం : రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో దీపిక పదుకొణె మాట్లాడుతూ - "రణ్‌వీర్‌కు, నాకు పిల్లలంటే ఎంతో ఇష్టం. పిల్లలతో మా ఫ్యామిలీని పరిపూర్ణం చేసుకోబోయే ఆ క్షణం కోసమే మేమూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం. చిన్నప్పుడు నుంచి మా అమ్మానాన్న నన్ను ఎంతో క్రమ శిక్షణతో, వినయంగా పెంచారు. రణ్‌వీర్ కూడా అలానే పెరిగాడు. అందుకే మేము కూడా మా పిల్లల్ని సెలబ్రిటీ స్టేటస్‌తో సంబంధం లేకుండానే పెంచుతాం. మంచి విలువల్ని నేర్పిస్తాం" అని చెప్పింది.