Deepika Padukone Kalki Movie : 'కల్కి 2898 AD' మూవీ ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న విడుదల కాబోతోంది. ఇందులో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె కీలక పాత్ర పోషించింది. ఆమె సుమతి (SUM-80)గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. అయితే చాలా మంది దీపికా పదుకొణెది ఇదే తొలి తెలుగు సినిమా అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. 'కల్కి 2898 AD' విడుదల సమీపిస్తున్న వేళ, దీపికా పదుకొణె గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
దీపికా మొదటి తెలుగు సినిమా ఏది?
ఎక్కువ మంది భావిస్తున్నట్లు 'కల్కి' దీపిక, మొదటి తెలుగు మూవీ కాదు. ఆమె 2009లో జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించిన 'లవ్ 4 ఎవర్'తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో రణదీప్, మృదుల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో దీపిక ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఆమె షూటింగ్ కూడా పూర్తి చేసింది. అయితే వివిధ కారణాల వల్ల సినిమా విడుదల కాలేదు. అలా ఆమె తెలుగు అరంగేట్రం ప్రేక్షకులకు కనిపించకుండా పోయింది. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత, 'కల్కి 2898 AD'లో ముఖ్యమైన పాత్రతో తెలుగు ఇండస్ట్రీలోకి తిరిగి అడుగుపెట్టింది.
సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌లో అగ్ర నటులు
వైజయంతి మూవీస్ రూపొందించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రభాస్, దీపికా పదుకొణెతో పాటు చాలా మంది ప్రముఖ స్టార్లు నటించారు. అందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శోభన, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్, శాశ్వత ఛటర్జీ తదితరులు ఉన్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.