తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్! - ఆ స్టార్ హీరో సినిమాలో కేమియో రోల్​లో! - David Warner Telugu Movie - DAVID WARNER TELUGU MOVIE

David Warner Telugu Movie : ఇన్నేళ్లు బ్యాట్​ పట్టుకుని విధ్యంసాలు సృష్టించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు తన నటనతో అభిమానులను అబ్బురపరిచేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన ఓ తెలుగు సినిమాలో కేమియో రోల్ చేస్తున్నారన్న రూమర్స్ కాస్త నిజమైనట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏదంటే?

David Warner Telugu Movie
David Warner (Getty Images)

By ETV Bharat Sports Team

Published : Sep 23, 2024, 7:06 AM IST

David Warner Telugu Movie : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్​కు ఇండియన్ సినిమాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సౌత్​లోని పలు చిత్రాలకు సంబంధించిన సాంగ్స్​, డైలాగ్స్​కు వార్నర్ చేసిన రీల్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. 'పుష్ప' సినిమాలోని శ్రీ వల్లి పాట, అలాగే తగ్గేదేలే మేనరిజం చేస్తూ కూడా ఈయన ఇక్కడి అభిమానులకు చేరువయ్యాడు. అయితే ఎప్పటి నుంచో ఆయన మన సినిమాల్లో నటిస్తే బాగున్ను అని అనుకున్న ప్రేక్షకుల కోసం ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్వీట్​ సర్​ప్రైజ్ ఇచ్చారు. తన అప్​కమింగ్ మూవీలో ఓ కేమియో రోల్​లో మెరిసేలా చేశారు.

ఇటీవలె డేవిడ్ వార్నర్ గన్ పట్టుకుని ఓ షూటింగ్​లో పాల్గొన్న ఫొటోలు నెట్టింట లీక్​ అవ్వగా, అందరూ ఆయన 'పుష్ప-2'లో అతిథిలా కనిపించనున్నాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు వేరే హీరో మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇంతకీ ఆ మూవీ ఎవరిదో కాదు స్టార్ హీరో నితిన్ 'రాబిన్ హుడ్'. ​ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో డేవిడ్‌ వార్నర్‌ గెస్ట్ రోల్​లో తళుక్కున మెరిసినట్లు సినీ వర్గాల మాట. ఇటీవలే ఆస్ట్రేలియాలో ఆయన పాత్రకు సంబంధించిన షూట్‌ పూర్తి చేయగా, ఆ సమయంలో తీసిన కొన్ని స్టిల్సే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

అలా తెలుగు ప్రేక్షకులకు దగ్గర
అయితే వార్నర్‌ - తెలుగు ప్రజల మధ్య మంచి బాండింగ్ ఉంది. వార్నర్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి ప్రాతినిధ్యం వహించాడు. వార్నర్‌కి తెలుగు అభిమానులు చాలా సపోర్ట్‌ చేశారు. ఈ ప్రేమతో వార్నర్‌ అప్పుడప్పుడు తెలుగు సాంగ్స్‌కి డ్యాన్స్‌ చేస్తు, సినిమా డైలాగులు చెబుతూ రీల్స్‌ చేసేవాడు. ఇలా తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు.

వార్నర్‌ కూడా చాలా సార్లు హైదరాబాద్‌పై, తెలుగు అభిమానులపై ప్రేమ చూపించాడు. చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయం చెప్పాడు. హైదరాబాద్‌ని మిస్‌ అవుతున్నట్లు ఇటీవల ఓ పోస్ట్​ కూడా చేశాడు. ఇలా వార్నర్‌కి హైదరాబాద్‌తో విడదీయరాని బంధం ఏర్పడింది. 2025 ఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్‌ వార్నర్‌ని తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు.

బన్నీతో ప్రత్యేక అనుబంధం
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లోని పాటలకు స్టెప్పులు వేసి, డైలాగ్స్ మరింత ఆకట్టుకున్నాడు. కరోనా సమయంలో ఆ తర్వాత అల్లు అర్జున్ - వార్నర్ మధ్య స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవకపోయినా ఆన్‌లైన్‌లో చాలా సార్లు పలకరించుకున్నారు. పుట్టిన రోజు సందర్భాల్లో ప్రత్యేకంగా విష్‌ చేసుకొంటారు.

హైదరాబాద్​ను మిస్ అవుతున్న వార్నర్- తెలుగోళ్లతో డేవిడ్ భాయ్ బాండింగ్ అలాంటిది మరి! - David Warner

హాలీవుడ్ రేంజ్​లో వార్నర్ ఎంట్రీ- గ్రౌండ్​లోనే హెలికాప్టర్ ల్యాండింగ్

ABOUT THE AUTHOR

...view details