తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సినీ పరిశ్రమలో విషాదం - 19ఏళ్లకే దంగల్​ నటి మృతి - Dangal Actress Died

Dangal Actress Died : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అమిర్‌ ఖాన్‌ భారీ బ్లాక్ బస్టర్​ 'దంగల్‌' బాలనటి సుహాని భట్నాగర్‌ కన్నుమూసింది.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 4:05 PM IST

Updated : Feb 17, 2024, 6:06 PM IST

Dangal Actress Died :సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అమిర్‌ ఖాన్‌ భారీ బ్లాక్ బస్టర్​ 'దంగల్‌' బాలనటి సుహాని భట్నాగర్‌ కన్నుమూసింది. ఈ చిత్రంలో ఆమె చిన్నారి బబితా ఫోగట్‌ పాత్ర పోషించి గుర్తింపు పొందింది. దీంతో ఇప్పుడు 19 ఏళ్ల సుహాని మరణవార్త విని సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురైంది. బాలీవుడ్‌ సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. కాగా, గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ నేడు దీల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో మృతి చెందినట్టు బయట కథనాలు వస్తున్నాయి.

ఈ విషయాన్ని తెలుసుకున్న అమీర్​ ఖాన్ ప్రొడక్షన్ హౌస్​ కూడా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసి నివాళులు అర్పించింది. సుహానీ మనందరినీ విడిచి వెళ్లిపోయిందన్న వార్త బాగా కలచివేస్తోంది. ఆమె తల్లి పూజ, ఇతర కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాం. ఎంతో టాలెంట్​ ఉన్నఅమ్మాయి. ఆమె లేకుండా దంగల్‌ అసంపూర్ణం. మా గుండెల్లో ఎప్పటికీ అలానే ఉంటుంది సుహాని. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం అని రాసుకొచ్చింది.

గత కొద్ది రోజుల క్రితం సుహాని కాలికి గాయమైంది. దీంతో ఆమెను దిల్లీ ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఆమె వాడిన మందులు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి అంటూ ఇంగ్లీష్ మీడియాల్లో కథనాల్లో వస్తున్నాయి. కానీ ఆమె మరణానికి వెనక అసలు కారణం ఇంకా క్లారిటీగా తెలియలేదు. అసలు విషయం తెలియడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. కాగా, దంగల్‌ సినిమా తర్వాత పలు యాడ్స్​లోనూ సుహానీ నటించింది. అయితే 2019 జూన్‌ నుంచి మాత్రం సినిమాలు, షూటింగ్‌లకు ఆమె దూరంగానే ఉంటుంది. కేవలం చదువుపైనే పూర్తి దృష్టి పెట్టింది. అంతేకాదు, సోషల్‌మీడియాకు కూడా దూరంగానే ఉంది. చాాలా కాలం నుంచి ఆమె ఎటువంటి పోస్ట్ చేయలేదు. నవంబర్‌ 2021న చివరి పోస్ట్‌ చేసింది.

అదీ సార్​ ఐకాన్ స్టార్ బ్రాండ్​ - వామ్మో బన్నీ ధరించిన స్వెట్ షర్ట్​ ధర అంతా?

NBK 109 వర్సెస్​ దేవర : బాబాయ్ -​ అబ్బాయ్​ బాక్సాఫీస్ ఫైట్​!

Last Updated : Feb 17, 2024, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details