Cinematographer Senthil Kumar Wife : 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరపై చూపించినప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి, యోగా టీచర్ రూహి గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూనే ఆమె తుదిశ్వాస విడిచారు. ఇక ఆమె అంత్యక్రియలు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.
Roohi Career : ఇక రూహీ అసలు పేరు రుహినాాజ్. ఈమె వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు. చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పనిచేశారు. పలువురు సెలబ్రిటీలకు యోగా ఇన్‌స్టక్టర్‌గా పనిచేశారు. 2009లో సెంథిల్ రూహీల వివాహం జరిగింది. వీరికి ర్యాన్ కార్తికేయన్, ధృవ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన సతీమణి అనారోగ్యం కారణంగానే సెంథిల్ తాజాగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.
గతంలో సెంథిల్ ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. "మగధీర సినిమాకు పని చేస్తున్న సమయంలో నేను రూహిని కలిశాను. ఒక మనిషిని కలిసిన తర్వాత ఒక ఫీల్ కలుగుతుంది అంటారు కదా అలానే రూహిని కలిసినప్పుడు నాకు కుడా అలానే అనిపించింది. సినిమాలతో అంత బిజీగా గడిపే ఆ టైమ్‌లోనే మా ప్రేమ ఏదో అలా కుదిరిపోయింది. ఎక్కువ ఆలోచించలేదు. మగధీర షూటింగ్ జరుగుతుంది అదే టైమ్‌లో 'అరుధంతి' పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. కానీ ఆ టైమ్‌లోనే మా ప్రేమకి కూడా టైమ్ కేటాయించాల్సి వచ్చింది. ఆ సమయం నేను కరెక్ట్‌గా ఇచ్చాను కాబట్టే ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాం." అంటూ తన లవ్ స్టోరీ గురించి సెంథిల్ చెప్పారు.
Senthil Career : సెంథిల్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'ఐతే' సినిమాతో సెంథిల్ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత రాజమౌళి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'సై', 'యమదొంగ', 'మగధీర','ఛత్రపతి', 'ఈగ', 'బాహుబలి 1', 'బాహుబలి 2', 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలు వచ్చాయి. అన్నింటికీ ఆయన అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు.
రాజమౌళి మూవీకి సెంథిల్ దూరం, మహేశ్ సినిమాలో కొత్త సినిమాటోగ్రాఫర్- జక్కన్న స్కెచ్ ఏంటి?