తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కోపంతో ఊగిపోయి నాగబాబును కొట్టిన చిరంజీవి! - Chiranjeevi Nagababu - CHIRANJEEVI NAGABABU

Chiranjeevi Nagababu : స్వయంకృషితో ఎదిగి ఇండస్ట్రీని శాసించే స్థాయిలో నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. నాగబాబు, పవన్ కళ్యాన్ మొదలుకొని ఒక్కొక్కరిగా ఆయన ఫ్యామిలీ నుంచి హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూనే ఉన్నారు. అయితే ఓ సందర్భంలో తాను నాగబాబును కొట్టిన విషయాన్ని చెప్పారు చిరంజీవి. దాని గురించే ఈ కథనం.

కోపంతో ఊగిపోయి నాగబాబును కొట్టిన చిరంజీవి!
కోపంతో ఊగిపోయి నాగబాబును కొట్టిన చిరంజీవి!

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 1:37 PM IST

Chiranjeevi Nagababu : మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో నెగెటివ్ పాత్రల్లో కనిపించారు. ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు. తనలాగే తన పెద్ద తమ్ముడైన నాగబాబును కూడా హీరోగా పరిచయం చేశారు. కానీ సక్సెస్​ఫుల్ కాలేదు. ఆ తర్వాత నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా, ప్రొడ్యూసర్​గానూ కొనసాగిస్తూ వస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వరకూ జబర్దస్త్ అనే కామెడీ షోకు కూడా జడ్జిగానూ వ్యవహరించారు. అలా అన్న స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చి, తమ్ముడి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వెళ్లిన నాగబాబు - ఓ సారి చిరంజీవి చేతుల్లో దెబ్బలు తిన్నారట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవినే చెప్పారు.

"అమ్మకు చిన్ననాటి నుంచి అన్ని విషయాల్లో సాయంగా ఉండేవాడిని. ఒకరోజు ఒకేసారి రెండు పనులు చేయాల్సి వచ్చింది. అయితే నాగబాబుకు లాండ్రీ నుంచి బట్టలు తీసుకువచ్చే పని పురమాయించాను. నేను ఒక పని పూర్తి చేసుకుని వచ్చేసరికి నాగబాబు ఇంట్లోనే ఉన్నాడు. అది చూసి కోపంతో లాండ్రీ నుంచి బట్టలు తీసుకురాలేదా అని అడిగితే, లేదు నిద్రపోతున్నా అన్నాడు. కోపం ఆపుకోలేక కొట్టేశాను. అది చూసి అమ్మ నన్ను తిట్టేసింది కూడా. సాయంత్రం వరకూ ఎదురుచూసి నాన్న రాగానే విషయం మొత్తం ఆయనకు చెప్పేశా. అప్పుడు నాన్న కూడా వెళ్లి నాగబాబును మందలించేసరికి నాకు రిలీఫ్ అనిపించింది" అంటూ చిన్ననాటి విషయాలు పంచుకున్నారు చిరంజీవి.

కాగా, చిరంజీవి అంటే నాగబాబుకు, మెగా ఫ్యామిలీ మొత్తానికి చాలా గౌరవం, భయం కూడా. కొన్ని సినిమాల్లో చిరుతో కలిసి నాగబాబు నటించారు కూడా. అంజి సినిమాలో తనకంటే చిన్నవాడి పాత్రను చిరంజీవి పోషిస్తుంటే అరేయ్, ఏరా అని పిలవాల్సి వచ్చిందట. అలా పిలవడం కుదరదని చెప్పగా సినిమా యూనిట్ చిరు దగ్గరకు ఈ విషయాన్ని తీసుకెళ్లారట. నటిస్తోంది పాత్రలే కానీ, మనం అలా మాట్లాడుకోవడం లేదు కదా అని సముదాయించడంతో అర్థం చేసుకుని అప్పుడు కానీ, నాగబాబు షూటింగ్‌కు రాలేదట. ఇప్పుడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా సినిమాల్లోకి వచ్చి హీరో పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఆయనకు ప్రముఖ నటి లావణ్య త్రిపాఠీతో వివాహం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details