తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పుష్ప 2 నిజంగానే వైల్డ్​ ఫైర్'​ - ట్రైలర్​పై సినీ సెలబ్రిటీల రివ్యూస్​ ఇవే! - PUSHPA 2 TRAILER REVIEW

'పుష్ప 2' ట్రైలర్​పై ప్రశంసలు కురిపిస్తున్న సినీ సెలబ్రిటీలు - ఎవరెవరు ఏమన్నారంటే?

Celebrities About Pushpa 2 Trailer
Celebrities About Pushpa 2 Trailer (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2024, 10:34 AM IST

Celebrities About Pushpa 2 Trailer : ప్రస్తుతం సోషల్‌ మీడియా అంతా పుష్పగాడి రూలే నడుస్తోంది. నెట్టింట పుష్ప 2 ట్రైలర్‌లోని సన్నివేశాలను షేర్ చేస్తూ, అందులోని అంశాలు, అల్లు అర్జున్ యాక్టింగ్​, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో పుష్ప 2: ది రూల్‌ ట్రైలర్‌ భారీ స్థాయిలో వ్యూస్‌ను అందుకుంటూ ఫుల్ ట్రెండ్‌ అవుతోంది.

ఫ్యాన్స్​, సినీ ప్రియుల, సెలబ్రిటీలు అంతటా ఈ చిత్ర ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రచార చిత్రం నిజంగానే వైల్డ్‌ ఫైర్‌ అంటూ తెగ పోస్ట్‌లు, కామెంట్లు పెడుతున్నారు. ఇదే సమయంలో వారందరికీ పేరుపేరునా అల్లు అర్జున్‌ కూడా థ్యాంక్స్‌ చెబుతున్నారు. మరి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పుష్ప 2 ట్రైలర్​పై ఏమన్నారో చూద్దాం.

పుష్ప -2 ఓ మాస్టర్ పీస్. నా హీరో అల్లు అర్జున్ మరోసారి తాను ఎందుకు బెస్ట్​ అనేది నిరూపించుకున్నారు. బన్నీ స్టైల్​, ఆటిట్యూడ్, పెర్ఫార్మన్స్ అన్నీ అద్భుతం. ఆయనలా మరొకరు చేయలేరు. నిజంగా అల్లు అర్జున్ మాస్ అండ్​ స్టైల్​కు కింగ్. పుష్ప రాజ్ తగ్గేదే లే.

- నిర్మాత బండ్ల గణేష్

తిరుగుబాటును విప్లవంగా మార్చిన వ్యక్తి తిరిగొచ్చాడు. అప్పటి కన్నా ఎక్కువ ఉగ్రంగా, ఘోరంగా కనిపిస్తున్నాడు. ఈ పవర్‌ హౌస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డిసెంబర్‌ 5 కోసం ఎదురుచూస్తున్నాను.

- దర్శకుడు ప్రశాంత్‌ వర్మ

ఈ ట్రైలర్​ నిజంగానే వైల్డ్‌ ఫైర్‌. అల్లు అర్జున్‌, సుకుమార్‌ మరోసారి మేజిక్‌ చేయడానికి రెడీ అయ్యారు. ఇది పవర్‌ ప్యాక్డ్‌ ట్రైలర్‌. బిగ్‌ స్క్రీన్‌పై సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నాను.

- దర్శకుడు అనిల్‌ రావిపూడి

ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు, నేషనల్‌ అనుకుంటారా, ఇంటర్నేషనల్‌ అనుకుంటారా.

- దర్శకుడు బుచ్చిబాబు

ప్రతి ఫ్రేమ్‌ మీ కృషిని తెలియజేస్తోంది. పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌ తపన కనపడుతోంది. దీని కోసం మీరు పడిన కష్టం. మీ శ్రమ, వెచ్చించిన సమయం అన్నీ సినిమాపై మీకున్న ప్రేమకు స్పష్టమైన సాక్ష్యాలు. హ్యాట్సాఫ్ డియర్‌ అల్లు అర్జున్‌

- దర్శకుడు హరీశ్‌ శంకర్‌

పుష్ప 2 ట్రైలర్‌ ఓ బ్లాక్‌ బస్టర్. ఐకాన్‌ స్టార్‌ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ సుకుమార్‌ సర్‌ ప్రతిభ కనపడుతోంది. టీమ్‌కు నా శుభాకాంక్షలు

- దర్శకుడు బాబీ

ట్రైలర్‌లోని మాస్‌ ఎలిమెంట్స్‌ సూపర్. మరో బ్లాక్‌ బస్టర్‌ రెడీ అవుతోంది. చిత్రబృందానికి అభినందనలు

- రిషబ్‌ శెట్టి

'తొలి సారి వచ్చా ఇక్కడికి - అలా జరిగినందుకు కారణం మీరే' : అల్లు అర్జున్

'పుష్ప రాజ్' రూల్ షురూ - ట్రైలర్ ఆగయా!

ABOUT THE AUTHOR

...view details