Cannes Film Festival 2024 :ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ చలనచిత్ర రంగంలో అంగరంగవైభవంగా దీన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో ఇండియాతో పాటు వరల్డ్ వైడ్‌గా ఉన్న పలువురు సెలబ్రిటీలు పాల్గొని సందడి చేస్తుంటారు. వీళ్లంతా నూతన డిజైనర్ డ్రెస్సుల్లో హోయలుపోతుంటారు. అయితే ఈ వేడుకల్లో భాగంగా చాలా ఏళ్ల తర్వాత తొలిసారి ఇండియన్ ఫిల్మ్ ఓ అరుదైన ఘనత సాధించింది.
2024లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్ కాంపిటీషన్ విభాగంలో భారతీయ సినిమా 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్'(All We Imagine As Light) ఎంపికైంది. ఈ గొప్ప విషయాన్ని కేన్స్ ఫిల్మ్ నిర్వాహకులు ట్విట్టర్లో అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. తాజాగా ఈ పోటీలో ప్రదర్శించే సినిమాల లిస్ట్‌ను విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన సినిమాలు ఇందులో పోటీ పడుతున్నాయి. 1994 తర్వాత ఈ ఫెస్టివల్ స్క్రీనింగ్ కాంపిటీషన్‌కు సెలెక్ట్ అయిన ఇండియన్ మూవీ ఇదొక్కటే కావడం విశేషం. అప్పట్లో మలయాళ సినిమా స్వహం తొలిసారి ఈ స్క్రీనింగ్ కాంపిటీషన్‌కు ఎంపికైంది. అంటే ఈ ప్రతిష్ఠాత్మక పోటీలకు భారతీయ సినిమా ఎంపికవడం 30ఏళ్లలో ఇదే తొలిసారి అన మాట.