Balakrishna Akhanda 2 Release Date: నందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'అఖండ 2' తాండవం. రీసెంట్‌గానే ఈ చిత్రం గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. అయితే, ఈ సీక్వెల్‌కు సంబంధించి తాజాగా మూవీటీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలిపింది. అలాగే రిలీజ్ డేట్ ప్రోమోను కూడా విడుదల చేసింది. వచ్చే ఏడాది 2025 దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది.
ఈ రిలీజ్ డేట్ ప్రోమోలో బాలయ్య సినిమా లాంఛ్ సమయంలో చెప్పిన డైలాగ్‌ను చూపిస్తూ, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను ప్లే చేసింది. ఇంకా ఈ వీడియోలో శివుడి తాండవం చేస్తున్నట్లు విజువల్స్‌ను గ్రాఫిక్స్ రూపంలో చూపించింది. ఇప్పటికే బాలయ్య మొదటి భాగంలో శివ భక్తుడిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు రెండో భాగంలోనూ ఆయన శివ భక్తుడిగా , మరింత పవర్‌ఫుల్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
పైగా నిజ జీవితంలోనూ బాలయ్య సంప్రదాయాలకు ఎంత విలువనిస్తారో తెలిసిందే. ఆయనకు దైవభక్తి చాలా ఎక్కువ. ఇప్పుడు అఖండ 2లో అలానే కనిపించనున్నారు. ఆచారాల కోసం పోరాడే, దేవాలయాలను, వాటి పవిత్రతను కాపాడే పాత్రలో ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ పవర్‌ఫుల్ పాత్రకు బోయపాటి శక్తివంతమైన డైలాగులు రాస్తున్నారట.