తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మూవీ లవర్స్​కు స్పెషల్ ట్రీట్! - ఈ టాప్ 10 చిత్రాలతో 80స్​ ఫీల్​ను ఆస్వాదించండి! - 80S BOLLYWOOD MOVIES ON OTT - 80S BOLLYWOOD MOVIES ON OTT

Top 10 Bollywood 80s Movies : మీకు పాత సినిమాలంటే ఇష్టమా? భాషతో సంబంధం లేకుండా ఏ జానర్ చిత్రాలైనా చూస్తారా? అయితే ఈ టాప్ 10 బాలీవుడ్ ఎవర్​గ్రీన్ మూవీస్​పై ఓ లుక్కేయండి.

80s Movies OTT
80s Movies OTT (Source : Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2024, 6:32 PM IST

Top 10 Bollywood 80s Movies : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కెరీర్‌ను మలుపు తిప్పిన 'మైనే ప్యార్ కియా', అతిలోక సుందరి శ్రీదేవికి బాలీవుడ్‌లో బ్రేక్ ఇచ్చిన 'నాగినీ' లాంటి సినిమాల గురించి ఇప్పటితరంలో అతి తక్కువ మందికే తెలుసు. అప్పట్లో నిర్మాతలు ధైర్యం చేసి పలు కేటగిరీల్లో సినిమాలు తీశారు కాబట్టే ఇప్పటి సినిమాలు ఇంత అడ్వాన్స్​డ్‌గా రాగలుగుతున్నాయని క్రిటిక్స్ అభిప్రాయం. అయితే ఒకానొక సమయంలో ఇండియన్ ఫిల్మ్​ ఇండస్ట్రీలో బాలీవుడ్ దూసుకెళ్లడానికి పలు సినిమాలు కారణమయ్యాయి. మరి హిందీ పరిశ్రమ గతిని మార్చిన 80ల నాటి సినిమాలేంటో చూసేద్దమా

  1. సాద్మా (1982)-MX Player
    నటీనటులు: కమల్ హాసన్, శ్రీదేవీ, సిల్క్ స్మిత, గుల్షన్ గ్రోవర్, కన్వార్జిత్ పైంటల్
  2. సిల్​సిలా (1981)- అమెజాన్ ప్రైమ్
    నటీనటులు: అమితాబ్ బచ్చన్, రేఖా, జయా బచ్చన్, శశి కపూర్, సంజీవ్ కుమార్
  3. సత్తా పే సత్తా (1982)- అమెజాన్ ప్రైమ్
    నటీనటులు: అమితాబ్ బచ్చన్, హేమా మాలినీ, అంజద్ ఖాన్, శక్తి కపూర్, సచిన్ పిల్గావొంకర్, సారిక, రంజిత్, ఖాదిర్ ఖాన్, బిందు
  4. మిస్టర్ ఇండియా (1987)- జీ5
    నటీనటులు: అనిల్ కపూర్, శ్రీదేవీ, అమ్రిష్ పురి, సతీశ్ కౌశిక్, అఫ్తాబ్ శివ్ దాసానీ, అన్ను కపూర్
  5. మైనే ప్యార్ కియా (1989)- జీ5, అమెజాన్ ప్రైమ్
    నటీనటులు : భాగ్య శ్రీ, సల్మాన్ ఖాన్, రీమా లగో, మోహ్నిష్ బల్, ఏ నాథ్, దిలీప్ జోషి, లక్ష్మీ కాంత్ బెర్దే, రాజీవ్ వర్మ
  6. ఖూన్ భరీ మాంగ్ (1988)- జీ5
    నటీనటులు: రేఖా, రాకేశ్ రోషన్, కబీర్ బేడీ, ఖాదర్ ఖాన్, సోనూ వాలియా, శత్రుఘన్ సిన్హా
  7. చాందినీ (1989)- అమెజాన్ ప్రైమ్
    నటీనటులు: శ్రీదేవీ, రిషీ కపూర్, వినోద్ ఖన్నా, జుహీ చావ్లా, వహీద్ రెహ్మాన్, సుష్మా సేత్
  8. ఖయామత్ సే ఖయామత్ తక్ (1988)- జీ5
    నటీనటులు : ఆమిర్​ ఖాన్, జుహీ చావ్లా, దలీప్ తాహిల్, ఇమ్రాన్ ఖాన్, రీమా లగో, ఫైజల్ ఖాన్, అలోక్ నాథ్
  9. నగీనా (1986)- అమెజాన్ ప్రైమ్
    నటీనటులు: రిషీ కపూర్, శ్రీదేవీ, అమ్రిష్ పురి, ప్రేమ్ చోప్రా, గుడ్డి మారుతీ
  10. రామ్ లఖణ్ (1989) - అమెజాన్ ప్రైమ్
    నటీనటులు :జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, డింపుల్ కపాడియా, అమ్రిష్ పురీ, సతీశ్ కౌశిక్, అనుపమ్ ఖేర్, రాఖీ, పరేశ్ రావల్, గుల్షన్ గ్రోవర్

మరి ఇంకెందుకు ఆలస్యం, చేతిలో పాప్ కార్న్ తీసుకుని ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాలను చూసేయండి. ఎక్కడికో వెళ్లి చూడాల్సిన అవసరం లేదు ఓటీటీల్లో అందుబాటులో ఉన్న వీటి కోసం ఒక్క రిమోట్ అందుకుంటే చాలు.

ABOUT THE AUTHOR

...view details