Bigg Boss Telugu 8 Contestants List: ప్రముఖ బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సరికొత్త సీజన్ మొదలైంది. ఈ సీజన్-8లో ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్ట్‌లకు లిమిటే లేదు అంటూ షో మొదలుపెట్టారు. ఈ సారి కూడా వ్యాఖ్యాతగా నాగార్జున సందడి చేశారు. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో మొదలైన ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా ఎవరు వెళ్లారో ఇప్పుడు చూద్దాం..
యష్మి గౌడ(Yashmi):సీజన్-8లో తొలిసారి అడుగు పెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు నటి యష్మి గౌడ. బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే.
అభయ్ నవీన్(Abhai Naveen):నటుడిగా, దర్శకుడిగా అభయ్ నవీన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పెళ్లి చూపులు, గీత గోవిందం మూవీలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనకు ‘బిగ్‌బాస్’ అనే మంచి వేదిక దొరికిందని.. కొంచెం ఎమోషనల్ అయినా బయటకు కనపడనీయనని హౌజ్‌లోకి వెళ్లేముందు అన్నారు అభయ్.
నిఖిల్(Nikhil): కన్నడ సినిమాల్లో హీరోగా నటించారు నిఖిల్. అంతేకాకుండా తెలుగులో కూడా పలు సీరియల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బిగ్‌బాస్ సీజన్-8లో తాను బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నట్లు నిఖిల్ చెప్పుకొచ్చారు.
ప్రేరణ(Prerana):కన్నడలో ‘రంగనాయకి’ టీవీ షోతో మంచి పాపులర్ అయ్యారు ప్రేరణ కంభం. పలు తెలుగు సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు. "నేనూ, హీరోయిన్ రష్మిక క్లోజ్ ఫ్రెండ్స్. మేమిద్దరం స్కూటీ వేసుకుని అర్ధరాత్రి తిరిగిన రోజులున్నాయి. నాకు పెళ్లయి ఎనిమిది నెలలు అయింది. మా ఆయన పేరు శ్రీ పాద్. నాకు హౌస్‌లో లిమిట్‌లెస్‌గా నిద్ర కావాలి’" అంటూ హౌజ్‌లోకి వెళ్లారు.
ఆదిత్య ఓం(Aditya OM):‘లాహిరి లాహిరి లాహిరిలో..’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఆదిత్య ఓం. హౌస్‌లోకి వెళ్లే ముందు ఆదిత్య ఓం మాట్లాడుతూ.. "బిగ్‌బాస్ అనేది పెద్ద ఛాలెంజ్. నా కెరీర్‌లో మళ్లీ పుట్టేందుకు బిగ్‌బాస్‌కు వస్తున్నా"అని అన్నారు.
సోనియా(Soniya):నటి సోనియా కూడా బిగ్‌బాస్-8లోకి వెళ్లారు. రాంగోపాల్ వర్మ నుంచి వచ్చిన ‘దిశ’ మూవీతో ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. "నేను బిగ్‌బాస్‌కు రావడానికి కారణం కూడా ఉంది. డబ్బులున్న వాళ్లు రూ.కోట్లు పెట్టి ఇక్కడకు వద్దామన్నా కుదరదు. అతి తక్కువ మందికి వచ్చే అవకాశం నాకొచ్చింది. హౌస్‌లో లిమిట్ లెస్‌గా ఫ్రెండ్స్ కావాలి. కళరి, కరాటే కూడా నేర్చుకున్నా. ఒకరిద్దరికి దెబ్బలు కూడా పడ్డాయి" అని తన గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు వర్మ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.
బెజవాడ బేబక్క(Bezawada Bebakka):తన మాటలు, ప్రాసలు, పంచ్‌డైలాగ్‌లో నెటిజన్స్‌కు వినోదాన్ని పంచుతారు బెజవాడ బేబక్క. అలా అందరికీ సుపరిచితురాలైన ఆమె అసలు పేరు మధు నెక్కంటి. ఆమె చేసే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్. సీజన్-8లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టారు.
శేఖర్ బాషా(Shekar Basha):రేడియో జాకీగా శ్రోతలను అలరించిన వ్యక్తి శేఖర్ బాష. ఇంజినీరింగ్ తర్వాత రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి 18 ఐఆర్‌ఎఫ్ అవార్డులు తీసుకున్నారు. తానెప్పుడూ యాక్టివిస్ట్‌గా మారతానని అనుకోలేదని అన్నారు. పురుషుల పట్ల సమాజం వ్యవహరిస్తున్న మార్చుకోవాలని, లేకపోతే కుటుంబాలు చితికిపోతాయని అభిప్రాయపడ్డారు. ఈ సీజన్‌లో అసలు సిసలైన శేఖర్ బాషాను చూడబోతున్నారంటూ వేదికపైకి వచ్చారు.
కిరాక్ సీత(Kirrak Seetha):‘బేబీ’ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కిర్రాక్ సీత. ఈమె బిగ్‌బాస్ సీజన్-8లో అడుగు పెట్టారు. తనని తాను నిరూపించుకునేందుకు లిమిట్‌లెస్‌గా అవకాశాలు కావాలని.. తను కెరీర్‌లో ఉన్నతంగా ఎదగాలని చెప్పుకొచ్చారు.