Bigg Boss Telugu 8 Latest News:మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ సీజన్ 8 సంగ్రామం మొదలు కానుంది. దాదాపు 100 రోజుల పైనే ప్రేక్షకులను అలరించేందుకు సెప్టెంబర్ 1న సాయంత్రం ఏడు గంటలకు షో స్టార్ట్ కానుంది. కంటెస్టెంట్స్ సెలక్షన్, వారి ఏవీ షూటింగ్స్, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ సిద్ధం అయిపోయాయట. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ 8 కాన్సెప్ట్, థీమ్ ఇదే అంటూ నెట్టింట జోరుగా ఓ ప్రచారం సాగుతోంది. అలాగే ఈ సీజన్‌ను పాపులర్ అయిన మరో సీజన్ నుంచి కాపీ కొట్టారని సమాచారం. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
మొదటగా 17 మంది : ఈ సీజన్‌కు మొదటగా 17 మంది కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేసినట్టు తెలుస్తోంది. వారిలో.. ఆదిత్య ఓం, యష్మీ గౌడ, అభిరామ్ వర్మ, బెజవాడ బేబక్క, నిఖిల్ మలియక్కల్, నైనిక అనసురు, పెళ్లి చూపులు ఫేమ్ అభయ్ నవీన్, విష్ణుప్రియ, విస్మయ శ్రీ, కిర్రాక్ సీత.. మొదటిరోజే హౌజ్‌లోకి వెళ్లనున్నారని సమాచారం. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా మొదటి రెండు వారాల్లో ఇంద్రనీల్ వర్మ, రీతూ చౌదరి హౌజ్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. వీరితోపాటు ఆర్జే శేఖర్ బాషా, నాగ మణికంఠ, సహర్ కృష్ణన్, ఖయ్యూమ్ అలీ, సౌమ్యరావు కూడా కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది.
సూపర్ ట్విస్ట్: ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ తెలుగు-8 సీజన్ లో కొత్త కాన్సెప్ట్ ఉందంటూ ఒక న్యూస్ లీక్ అయింది. బిగ్ బాస్ హిందీ 8వ సీజన్ కాన్సెప్ట్నే తెలుగు బిగ్ బాస్ 8 సీజన్లో ఇంప్లిమెంట్ చేయనున్నట్టు సమాచారం. ఇంతకీ అదేమంటే.. హిందీ బిగ్ బాస్ 8లో, గత సీజన్‌లోని కంటెస్టెంట్స్‌ను తీసుకొచ్చి పార్టిస్పేట్ చేయించారట. పాత సీజన్లో నెగెటివ్‌గా గానీ, పాజిటివ్‌గా కానీ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న మాజీ హౌజ్‌మేట్స్‌ను సీజన్ 8లోకి తీసుకొచ్చి ఆడించారట. దీంతో షో టీఆర్పీ రేటింగ్ ఓ రేంజ్లో దూసుకెళ్లిందని.. ప్రస్తుతం అదే ప్లాన్ బిగ్ బాస్ తెలుగు 8లో కూడా అమలు కానున్నట్టు టాక్.
అందుకే మాజీ కంటెస్టెంట్స్‌తో తెలుగు బీబీ టీమ్ చర్చలు జరుపుతోందని సమాచారం. వారిలో కొంతమంది కన్ఫర్మ్ చేస్తున్నారు, మరికొంతమంది చూద్దాంలే అన్నట్టుగా రెస్పాండ్ అవుతున్నారట. ఏది ఏమైనా సీజన్ 8లోకి మాత్రం మాజీ కంటెస్టెంట్స్ వచ్చే అవకాశం చాలా గట్టిగా ఉందని తెలుస్తోంది. మరి హిందీలో వర్కౌట్ అయిన ఆ కాన్సెప్ట్ తెలుగులో ఎంతవరకు హిట్ అవుతోందో చూడాలి.