Bigg Boss 8 Telugu Sixth Week Nominations:బిగ్‌బాస్ సీజన్ 8లో సోమవారం రోజున ఆరోవారం నామినేషన్స్ ప్రాసెస్ జరిగింది. అయితే ఈసారి వైల్డ్ కార్డ్స్ రాకతో నామినేషన్స్‌లో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. "ఈసారి రాయల్ క్లాన్ రాకతో లెక్కలు మారాయి.. ఐదు వారాల మీ ప్రయాణాన్ని, మీ ఆటతీరు, మీ స్వభావాన్ని ఆడియన్స్‌లాగా చూసి వైల్డ్ కార్డ్స్ ఇక్కడికి వచ్చారు.. కనుక మీపై వారికి ఓ స్పష్టమైన అభిప్రాయం ఉండి ఉంటుంది.. కనుక ఈసారి నామినేషన్స్ రాయల్ క్లాన్ మాత్రమే చేస్తారు.. మీకు ఎవరు అనర్హులని భావిస్తే వాళ్లలో ఇద్దరూ ఓజీ క్లాన్ సభ్యులను నామినేట్ చేయాలి.. మెగా చీఫ్ అయిన కారణంగా నబీల్‌ను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు" అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు.
ఇక నామినేషన్ ప్రక్రియను హరితేజ మొదలెట్టింది. మొదటి బంతికే సిక్సర్ అన్నట్లు ఫస్ట్ నామినేషన్ యష్మీకి వేసింది. ఇక తర్వాత తన సెకండ్ నామినేషన్ పృథ్వీకి వేసింది హరితేజ. దీంతో వాళ్ల ముగ్గురు మధ్య గట్టిగానే వార్ నడిచింది.
గౌతమ్ తన నామినేషన్స్ వేయడానికి వచ్చాడు. సీజన్ 7లో పాటించిన అదే సంప్రదాయాన్ని ఫాలో అవుతూ పంచె కట్టుకొని వచ్చాడు డాక్టర్ బాబు. ఇక తన మొదటి నామినేషన్.. విష్ణుప్రియకి వేశాడు. తన సెకండ్ నామినేషన్ యష్మీకి వేశాడు గౌతమ్. "రివెంజ్ నామినేషన్ వేస్తున్నారు.. మణికంఠను ప్రతిసారి నిన్నే నామినేట్ చేస్తానని చెప్పడం కరెక్ట్‌గా అనిపించలేదు" అంటూ యష్మీని నామినేట్ చేశాడు.
నయని పావని.. ముందుగా విష్ణుప్రియను నామినేట్ చేసింది. తన సెకండ్ నామినేషన్ సీతకి వేసింది నయని. ఇక మెహబూబ్.. మొదటిగా సీతను నామినేట్ చేశాడు. యష్మీకి సెకండ్ నామినేషన్ వేశాడు. మొదటి నామినేషన్ సీతకి వేశాడు టేస్టీ తేజ. తన రెండో నామినేషన్ మణికంఠకి వేశాడు తేజ. అలా మణికంఠ మెడలో తేజ బోర్డు వేస్తుంటే యష్మీ చప్పట్లు కొట్టేసి.. "అద్దీ" అన్నట్లు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది.
ఇక మంగళవాపం ఎపిసోడ్లో రోహిణి ముందుగా యష్మీని నామినేట్ చేసింది. తన రెండో నామినేషన్ విష్ణుప్రియకి వేసింది రోహిణి. "మొదటి వారం చూసినప్పుడు విష్ణు బాగా ఆడుతుందనే ఫీలింగ్ కలిగింది.. కానీ ఆ రేంజ్ నుంచి తర్వాత కిందకి పడిపోయావ్.. నీ కాన్సట్రేషన్ వేరే చోట ఉంది.. నువ్వు రియల్‌గా ఉండు.. అంటే దాని అర్థం టాస్కులన్నీ ఆడి.. ప్రతి దాంట్లో ఎంజాయ్‌మెంట్ వెతుక్కో" అంటూ విష్ణుప్రియకు రోహిణి సలహా ఇచ్చింది.