తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8: హౌజ్​​లోకి వీళ్లు కూడా వచ్చేస్తున్నారటగా! - కొత్త కంటెస్టెంట్ల పేర్లు వైరల్ - Boss Season 8 Expected Contestants - BOSS SEASON 8 EXPECTED CONTESTANTS

Bigg Boss: తెలుగు రాష్ట్రాల్లో బిగ్​బాస్​ ఫీవర్ స్టార్ట్ అయ్యింది. షో ఎప్పుడు స్టార్ట్​ అవుతుందో అఫీషియల్​గా తెలియడంతో ఇప్పుడు అందరి దృష్టి.. కంటెస్టెంట్ల మీద పడింది. ఈ క్రమంలోనే కచ్చితంగా కంటెస్టెంట్స్ లిస్ట్​లో ఉన్న 12 మంది సెలెబ్రిటీలు వీరే అంటూ ఓ న్యూస్​ వైరల్​ అవుతోంది. మరి, వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Bigg Boss 8
Bigg Boss 8 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2024, 12:13 PM IST

Bigg Boss Season 8 Viral Contestants List:ఏడు సీజన్ల పాటు అలరించిన బిగ్​బాస్​ షో.. 8వ సీజన్​తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక షో ఎప్పుడు మొదలవుతుందో తెలిపేలా ప్రోమో కూడా రిలీజ్​ అయ్యింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి.. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల మీద పడింది. ఈ క్రమంలోనే కచ్చితంగా కంటెస్టెంట్స్ లిస్ట్​లో ఉన్న 12 మంది సెలెబ్రిటీలు వీరే అంటూ సోషల్ మీడియాలో న్యూస్​ వైరల్​ అవుతుంది. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

బిగ్ బాస్ తెలుగు 8 లాంచింగ్ ఎపిసోడ్ సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు ప్రారంభంకానుంది. స్టార్ హీరోలు గెస్ట్స్​గా రానున్నారని సమాచారం. ఎప్పటిలాగే ఇతర హీరోయిన్స్, కంటెస్టెంట్స్ అదిరిపోయే పెర్ఫామెన్స్​ ఇవ్వనున్నారు. ఇక ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచేలా నయా కాన్సెప్ట్స్ తో షోని సిద్ధం చేశారట. ఈసారి కంటెస్టెంట్స్ టైటిల్ కోసం గట్టిగా పోరాడాల్సి ఉంటుందట. గేమ్స్, టాస్క్స్, రూల్స్ కఠినంగా ఉండే సూచనలు ఉన్నాయని టాక్​.

బిగ్​బాస్​ 8 గ్రాండ్​ ఓపెనింగ్ - డేట్​ అనౌన్స్ చేసేశారుగా! - ఎప్పుడో తెలుసా?

ఆ 12 మంది వీళ్లేనట: బిగ్​బాస్​ మొదలవుతోందంటే.. మూడు నాలుగు నెలల ముందు నుంచే ఈ షో లో పార్టిసిపేట్​ చేయబోయే కంటెస్టెంట్స్​ ఎవరా అని తెగ డిస్కస్​ చేసుకుంటుంటారు ప్రేక్షకులు. అంతేనా ఎవరికి వారు నచ్చిన పేర్లు చెప్పేస్తుంటారు. అయినా ఎపిసోడ్ టెలికాస్ట్​ అయ్యే వరకు కంటెస్టెంట్స్ ఎవరు అనేది సీక్రెట్. స్టేజ్​ మీద నాగార్జున పరిచయం చేసే వరకు కూడా ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు? అనేది తెలియదు.

ట్రెండింగ్​లో కొత్త పేర్లు..

సీజన్ 8లో బిగ్ బాస్ హౌజ్​లో అడుగుపెట్టే సెలబ్రిటీలలో ఈ 12 మంది కచ్చితంగా ఉంటారంటూ కొన్ని రోజులుగా ఓ లిస్ట్ వైరల్ అవుతోంది. దాని ప్రకారం చూస్తే.. రీతూ చౌదరి, యాంకర్​ విష్ణు ప్రియ, సీరియల్ నటుడు నిఖిల్, యాంకర్ సౌమ్యరావు, సీరియల్ నటి అంజలి పవన్, యాక్టర్ అభిరామ్ వర్మ, నటి, యూట్యూబర్​ సోనియా సింగ్, ఆలీ తమ్ముడు, నటుడు ఖయ్యూం, సీరియల్​ నటి యష్మీ గౌడ.. బిగ్ బాస్ హౌజ్​లోకి వెళుతున్నారని సోషల్​మీడియా కోడై కూస్తోంది. అయితే.. వీళ్లతోపాటు మరికొన్ని పేర్లు కూడా బయటకు వచ్చాయి. వారిలో.. మోడల్ ఊర్మిళ చౌహాన్, సింగర్ సాకేత్, యూట్యూబర్​ బెజవాడ బేబక్క కూడా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. వీరి ఎంపిక దాదాపు ఖరారు అయ్యిందని అంటున్నారు.

సాధారణంగా ప్రతి సీజన్​కి 19 నుండి 21 మంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. అందులో కొద్దిమంది ఫస్ట్​ నుంచే బిగ్​బాస్​ హౌజ్​లోకి వెళ్లగా.. మిగిలిన కొద్దిమంది వైల్డ్​ కార్డ్​ ద్వారా ఎంట్రీ ఇస్తుంటారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్​లో 25 మందిని ఎంపిక చేసినట్లు సమచారాం. వారిలో 12 మంది పేర్లు బయటికి రాగా.. మిగతా లిస్ట్​ తొందరలోనే బయటికి వస్తుందంటున్నారు. మరి వారు ఎవరనేది చూడాలంటే వెయిట్​ చేయాల్సిందే..

వైరల్ న్యూస్ : బిగ్​బాస్​ 8లోకి టాలీవుడ్ హీరో - ఈ సీజన్​లో మస్తు షేడ్స్​ ఉన్నట్టున్నయ్​గా!

బిగ్​ బాస్​ 8లో "డబుల్ ధమాకా" - ఇప్పటి వరకూ చూడని సరికొత్త ఎలిమెంట్​ చూపిస్తారట!

బిగ్​బాస్​ 8 : ఈ సీజన్​లో పాల్గొనే కంటెస్టెంట్స్​ ఎవరో తెలుసా? - లిస్ట్​ మామూలుగా లేదు!

ABOUT THE AUTHOR

...view details