తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8 గ్రాండ్​ ఫినాలేకి ముహూర్తం ఫిక్స్​! - టాప్​ 5 కంటెస్టెంట్స్​ వీళ్లేనట! - BIGG BOSS 8 GRAND FINALE DATE

-మరో 13 రోజుల్లో సీజన్-8కి శుభం కార్డు -ఈ వారం నామినేషన్స్​లో ఒక్కరు మినహా ఆరుగురు

Bigg Boss 8 Telugu Grand Finale Date
Bigg Boss 8 Telugu Grand Finale Date (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2024, 11:50 AM IST

Bigg Boss 8 Telugu Grand Finale Date:ఊహించని ట్విస్ట్​లు, టర్న్​లతో రసవత్తరంగా సాగుతోన్న బిగ్​బాస్ సీజన్ 8 తెలుగు క్లైమాక్స్​కు చేరుకుంది. మరి సీజన్​ 8 గ్రాండ్ ఫినాలే ఎప్పుడు ఉండబోతోంది? టాప్​ 5 లెక్కలు ఎలా ఉన్నాయి? ప్రైజ్​ మనీ ఎంత? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సెప్టెంబర్​ 1న గ్రాండ్​గా మొదలైన బిగ్​బాస్​.. ఊహించని ట్విస్ట్​లు, టర్న్​లతో ఇప్పుడు రసవత్తరంగా మారింది. 14 మంది కంటెస్టెంట్స్​ హౌజ్​లోకి అడుగు పెడితే.. వారిని క్లాన్స్​గా డివైడ్​ చేసి వాళ్లలో వాళ్లకే చిచ్చు పెట్టారు బిగ్ బాస్. ఆ తర్వాత 8 మంది వైల్డ్​కార్డు ఎంట్రీలను హౌస్​లోకి పంపి.. ఆసక్తిని క్రియేట్ చేశారు. ముందుగా హౌజ్​మేట్స్ వర్సెస్ వైల్డ్​కార్డ్​లు అన్నట్టుగా పలు గేమ్స్​ని పెట్టి, నామినేషన్స్​లో ఊహించని ట్విస్ట్​లు ఇచ్చారు. ఆ తర్వాత అందరిని కలిపేసి ఒకే టీమ్​ అంటూ కంటెండర్ పోటీలో ఫైట్ చేయమన్నారు. దీంతో హౌజ్​మేట్స్ మధ్య లెక్కలు మారుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 15 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్​ అయ్యి ప్రస్తుతం హౌజ్​లో ఏడుగురు మాత్రమే మిగిలారు.

ఈవారం నామినేషన్స్​లో ఒక్కరు మినహా:ఈ సీజన్​లో చివరి నామినేషన్స్​ చప్పగా ముగిశాయి. "మీలో ఎవరు టాప్-5కి రావాలో ఆడియన్స్‌యే నిర్ణయిస్తారు" అంటూ అనౌన్స్​ చేసిన బిగ్​బాస్..​ ఎలాంటి నామినేషన్స్ ప్రక్రియ లేకుండా గత వారం టికెట్​ టూ ఫినాలే గెలిచి ఫస్ట్​ ఫైనలిస్ట్​ అయిన అవినాష్ మినహా అందరినీ నేరుగా నామినేట్ చేశాడు. దీంతో ఈ వారం నామినేషన్స్​లో విష్ణుప్రియ, గౌతమ్​, నిఖిల్​, ప్రేరణ, రోహిణి, నబీల్​ ఉన్నారు.

టాప్​ - 5 లెక్కలు ఇలా:సీజన్​ 8 ఎండింగ్​కు వచ్చిన నేపథ్యంలో టాప్​ - 5 ఎవరా అనే ఉత్కంఠ ఆడియన్స్​లో నెలకొంది. ఇప్పటికే అవినాష్​ నేరుగా ఫినాలేకి చేరుకోగా.. మిగిలిన నలుగురు ఎవరో ఈ వారం తేలనుంది. ఈ వారం కూడా డబుల్​ ఎలిమినేషన్​ ఉంటుంది. అయితే ఆరుగురులో ఇద్దరూ వీకెండ్​ ఎపిసోడ్స్​లోనే కాకుండా ఒకరు మిడ్​ వీక్​లో, మరొకరు వీకెండ్​లో ఎలిమినేట్​ కానున్నట్లు టాక్​. అయితే సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోన్న ప్రకారం టాప్​ 5 లో నిఖిల్​, గౌతమ్​, నబీల్​, విష్ణుప్రియ, అవినాష్​ ఉండనున్నట్లు సమాచారం.

ఇప్పటివరకూ ఫ్రైజ్​ మనీ ఇది:గత అన్ని సీజన్లలో ప్రైజ్​మనీ లాస్ట్​లో రివీల్​ చేసేవారు. కానీ ఈ సీజన్​లో ప్రైజ్ మనీ సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంత అనేలా చేశారు. అందుకే ఇప్పటివరకూ ఏ సీజన్‌కీ లేనంత ప్రైజ్​మనీ ఈ సీజన్​లో వచ్చింది. ప్రస్తుతానికి సీజన్-8 ప్రైజ్ మనీ 54 లక్షల 30 వేలకి చేరింది. ఇది ఇంకా పెరిగే లేదా తగ్గే అవకాశం ఉందంటూ హోస్ట్​ నాగ్ చెప్పారు.

గ్రాండ్​ ఫినాలే ఆ రోజే:తాజా సమాచారం ప్రకారం బిగ్‌బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 15 ఆదివారం రాత్రి 7 గంటలకు టెలికాస్ట్ కానుందని సమాచారం. అంటే ఈరోజు నుంచి మరో 13 రోజుల్లో సీజన్-8కి శుభం కార్డు పడబోతుంది. ఇక రోజులబట్టి చూస్తే ఈ సీజన్ మొత్తం 105 రోజులు జరగనుంది. ఇక ఈసారి గ్రాండ్ ఫినాలేకి భారీ ఏర్పాట్లే చేయబోతున్నట్లు టాక్. స్టార్ హీరోయిన్లతో ఆటపాటలే కాకుండా ట్రోఫీ అందజేయడానికి చీఫ్ గెస్టును కూడా పిలిచే ఆలోచనలో ఉన్నారట.

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

"పక్కనోళ్ల బాధ గురించి వాడికి అక్కర్లేదు" - "వాడికి అదే సమస్య" - నాగ మణికంఠ చెల్లెలు షాకింగ్​ కామెంట్స్​!

ABOUT THE AUTHOR

...view details