తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8: మిడ్​ వీక్​ షాకింగ్​ ఎలిమినేషన్​ - ఇంటి నుంచి ఆ కంటెస్టెంట్​ అవుట్​! - కానీ!! - Bigg Boss 8 Mid Week Elimination - BIGG BOSS 8 MID WEEK ELIMINATION

Bigg Boss 8 Mid Week Elimination : బిగ్​బాస్​ సీజన్​ 8 ఐదో వారం కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వారంలో ఆరుగురు నామినేషన్లలో ఉండగా.. డబుల్​ ఎలిమినేషన్​ ఉంటుందని ముందుగానే చెప్పేశారు హోస్ట్​ నాగార్జున. అందుకు తగ్గట్టుగానే మిడ్​ వీక్​ ఎలిమినేషన్​ ఎపిసోడ్​ పూర్తి అయ్యిందని సమాచారం. అంతే కాదు ఆ ఆరుగురిలో ఎలిమినేట్​ అయిన కంటెస్టెంట్​ పేరు కూడా సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. మరి వారు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం..

Bigg Boss 8 Mid Week Elimination
Bigg Boss 8 Mid Week Elimination (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2024, 1:56 PM IST

Bigg Boss 8 Mid Week Elimination :బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఊహించని ట్విస్టులు ఉంటాయని హోస్ట్​ నాగార్జున ముందే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఓ వైపు వైల్డ్​ కార్డ్​ ఎంట్రీలు, మరో వైపు డబుల్​ ఎలిమినేషన్​ అంటూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్​ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌజ్​లోకి వైల్డ్​ కార్డు ఎంట్రీ రూపంలో కొంత మంది సభ్యులు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే వాళ్లెవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక గురువారం రోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన షూటింగ్​ కూడా కంప్లీట్​ అయినట్లు తెలుస్తోంది. మిడ్ వీక్ ఎలిమినేషన్​లో భాగంగా ఒకరు ఎలిమినేట్ అయినట్లు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. మరి వారు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం..

నామినేషన్స్​లో ఉన్నది వీళ్లే:నాలుగో వారంలో సోనియా ఆకుల ఎలిమినేషన్​ తర్వాత.. ఐదో వారానికి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నామినేట్​ చేయాలనుకున్న ఇద్దరి కంటెస్టెంట్ల ఫొటోలను మంటల్లో వేయాలని బిగ్​బాస్​ ప్రకటించాడు. ఇక ఈ నామినేషన్లలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఇక అందరి నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇంట్లో ఉన్న సభ్యులకి ఒక స్పెషల్ పవర్ ఇస్తూ.. చీఫ్‌లు ఇద్దరిలో ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయొచ్చు అంటూ బిగ్‌బాస్ అన్నాడు. దీంతో ఆరుగురు సభ్యులు సీతను సేవ్ చేయాలంటూ హ్యాండ్స్ రెయిజ్ చేశారు. కేవలం పృథ్వీ, యష్మీ మాత్రమే నిఖిల్ వైపు ఉన్నారు. దీంతో నిఖిల్ కూడా నామినేషన్స్‌లోకి వచ్చాడు. మొత్తంగా ఈ వారం ఆరుగురు సభ్యులు నామినేట్​ అయ్యారు. వారెవరో చూస్తే.. విష్ణు ప్రియ, నైనిక, మణికంఠ, ఆదిత్య, నబీల్​, నిఖిల్​..

ఫస్ట్ వైల్డ్​ కార్డ్​ ఎంట్రీ ఇతనిదే - ఫొటో రిలీజ్​ చేసిన బిగ్​బాస్ - ఎవరో గుర్తుపట్టగలరా?

మిడ్​ వీక్​ ఎలిమినేషన్​ అయ్యేది ఎవరంటే:గత సండే రోజు ఎపిసోడ్​లో.. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పాడు. దీంతో ఎవరు వెళ్తారనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. సోమవారం రోజు నామినేషన్స్​ ముగియగా.. ఆ రోజు అర్ధరాత్రి నుంచి శుక్రవారం వరకు ఓటింగ్​ జరగనుంది. ఇక అన్​ అఫీషియల్​ పోలింగ్స్​ చూస్తే.. ఇప్పటి వరకు నబీల్, నిఖిల్ టాప్​లో ఉన్నారు. వీరితో పాటు విష్ణుప్రియకి కూడా ఓటింగ్​ పెరిగింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో మణికంఠ, ఆదిత్య, నైనిక ఉన్నారు. అయితే నైనిక, ఆదిత్యలకు మధ్య ఓటింగ్​లో చాలా స్వల్ప తేడా మాత్రమే ఉంది. సాధారణంగా అయితే ఈ ఆరుగురిలో వీకెండ్​లో ఒకరు ఎలిమినేట్ అవుతారు. కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ కాబట్టి గురువారం రోజు ఒకరు.. శనివారం రోజు ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. గురువారం రోజు ఎలిమినేషన్ ప్రక్రియ షూటింగ్ ఆల్రెడీ ముగిసింది. ఆ కంటెస్టెంట్​ ఎవరో కూడా తెలిసిపోయింది.

మిడ్ వీక్ ఎలిమినేషన్​లో అతను అవుట్ ?:మిడ్ వీక్ ఎలిమినేషన్​లో భాగంగా ముందుగా ఆదిత్య ఓంని గురువారం ఎపిసోడ్​లో ఎలిమినేట్ చేశారట. ఆదివారం రోజు వైల్డ్​ కార్డ్​ ఎంట్రీలు రాబోతున్న సమయంలో.. శనివారం రోజు నైనికా ఎలిమినేట్​ అవుతుందని సమాచారం. అయితే ఆదిత్య.. హౌజ్​ నుంచి బయటకి వెళతాడు కానీ పబ్లిక్ లోకి రాడు అని అంటున్నారు. శనివారం ఎపిసోడ్ వరకు నిర్వాహకులు అతడిని సీక్రెట్​గా ఉంచి.. శనివారం ఎపిసోడ్​లో వేదికపైకి పంపించబోతున్నారని సమాచారం. ఆదిత్య ఓం హౌజ్​లో హైయెస్ట్ పెయిడ్​ కంటెస్టెంట్స్​లో ఒకరని తెలుస్తోంది.

బిగ్​బాస్​ 8: "రీలోడ్​ ఈవెంట్​" - వైల్డ్​ కార్డ్​ ఎంట్రీస్​పై హింట్​ ఇచ్చిన నాగార్జున - ఎవరొస్తున్నారో తెలిసిపోయిందిగా!!

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

ABOUT THE AUTHOR

...view details