Bigg Boss 8 Mehaboob Elimination:బిగ్‌బాస్ ఇంట్లో ఆదివారం నాడు(అక్టోబర్ 27) దీపావళి స్పెషల్ ఎపిసోడ్ గ్రాండ్‌గా జరిగింది. దాదాపు మూడున్నర గంటల పాటు ఈ ఎపిసోడ్ సాగింది. క, లక్కీ భాస్కర్, అమరన్ టీమ్ సభ్యులు స్టేజ్ మీదకు వచ్చి కంటెస్టెంట్లతో ఆటలు ఆడించి సందడి చేశారు. అంతేకాకుండా అనసూయ డ్యాన్స్ పర్ఫామెన్స్, సమీరా భరద్వాజ్ పాటలు, హైపర్ ఆది సెగ్మెంట్, హీరోయిన్ల డ్యాన్సులు ఇలా అన్నీ కూడా అదిరిపోయాయి. ఇక ఈ ఎనిమిదో వారంలో ఎలిమినేషన్ ఘట్టం కూడా పూర్తయింది. ఈ వారం మెహబూబ్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. ఎలిమినేషన్ తర్వాత ఏం జరిగింది? రెమ్యునరేషన్ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ వారం ఆరుగురు నామినేషన్స్‌లో ఉండగా.. ఒక్కొక్కరూ సేవ్ అవుతూ లీస్ట్ ఓటింగ్ వచ్చి ఎలిమినేషన్ కాబోయే జాబితాలో నయని పావని, మెహబూబ్ నిలిచారు. ఈ ఇద్దరిలో తక్కువ ఓటింగ్ వచ్చిన కారణంగా మెహబూబ్ బయటకు వచ్చారు. ఎలిమినేషన్ అనంతరం స్టేజ్ మీదకు వచ్చిన మెహబూబ్ తన జర్నీ చూసి ఎమోషనల్ అయ్యాడు. ఇక మాట్లాడుతూ.. "ఇంతకుముందు దీపావళి సమయంలోనే నేను ఎలిమినేట్ అయ్యా. ఇప్పుడూ అదే పండగ వేళ ఎలిమినేట్ అయ్యా. అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడంలేదు. ప్రతి టాస్క్‌లోనూ నా బెస్ట్ ఇవ్వాలనే హౌజ్‌లోకి వచ్చా. కానీ, దురదృష్టవశాత్తూ బయటకు వచ్చేశా" అని ఎమోషనల్ అయ్యాడు. ఇక ఆ తర్వాత పలువురు హౌజ్‌మేట్స్‌ను టపాసులతో పోల్చుతూ.. వారితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మెహబూబ్.
- థౌంజడ్ వాలా.. అవినాశ్: "‘హౌజ్‌లో ఎప్పుడూ వినోదం పంచుతూ ఉంటాడు. టాస్క్‌ల్లో బాగా ఆడతాడు" అంటూ చెప్పారు.
- లక్ష్మీబాంబ్.. గంగవ్వ: "‘అవ్వా.. నిన్ను మిస్ అవుతున్నా. నీకు ఏ అవసరం ఉన్నా కాల్ చేయ్. నేను అండగా ఉంటా. బాధపడకు" అంటూ చెప్పాడు. ఈ క్రమంలో గంగవ్వ ఎమోషనల్ అయ్యింది.
- తారాజువ్వ.. నబీల్:"నువ్వు రాకెట్‌లా దూసుకెళ్లాలి. హౌజ్‌లోకి వచ్చాక నీ గురించి బాగా అర్థమైంది. నువ్వు బాగా ఆడాలి" అంటూ సలహాలు ఇచ్చాడు.
- కాకరవత్తి.. రోహిణి:"‘అవినాశ్- రోహిణి ఉంటే మాకు నవ్వులే నవ్వులు. రోహిణి.. మీరు బాగా ఆడాలి. మన క్లాన్ నుంచి మీరు మళ్లీ చీఫ్ అవ్వాలి" అంటూ సూచనలు ఇచ్చాడు.’
- అగ్గిపెట్టె.. గౌతమ్:"‘గౌతమ్ నీలో ఫైర్ ఉంది. దాన్ని బయటకు తీసుకొచ్చి వెలుగు నింపగలవు. ఇంకా బాగా ఆడు" అని మెహబూబ్ పేర్కొన్నారు.
రెమ్యునరేషన్ ఇదే!: ఇదిలా ఉంటే, అక్టోబర్ 6న బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన మెహబూబ్ 3 వారాలు ఇంట్లో ఉన్నాడు. ఒక్క వారానికి దాదాపుగా రూ. 3 లక్షల వరకు పారితోషికం అందుకున్నాడని సమచారం. ఇలా మొత్తంగా బిగ్‌బాస్ తెలుగు 8 ద్వారా 3 వారాలకు మెహబూబ్ దిల్ సే 9 లక్షల రూపాయలు సంపాదించాడని సోషల్ మీడియా టాక్!!