Best Actor Oscar 2024:96వ ఆస్కార్ అవార్డ్స్‌లో హలీవుడ్ హీరో కిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఓపెన్ హైమర్ సినిమాలో ఆయన నటనకుగాను మర్ఫీకి ఈ అవార్డు లభించింది. ఇక ఓపెన్‌హైమర్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్నారు. కాగా, ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ పురస్కారం అందుకోవడం క్రిస్టోఫర్ నోలన్‌కు ఇదే తొలిసారి. అలాగే ఎమ్మా స్టోన్‌కు ఉత్తమ నటి అవార్డు వరించింది. ఇకఓపెన్‌హైమర్ సినిమా ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది.
ఆస్కార్‌లో ఓపెన్ హైమర్ జోరు ప్రదర్శించింది. మొత్తం 7 కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుంది.
- ఉత్తమ చిత్రం- ఓపెన్‌హైమర్
- ఉత్తమ దర్శకుడు- క్రిస్టోఫర్ నోలన్
- ఉత్తమ నటుడు- కిలియన్ మర్ఫీ
- ఉత్తమ సహాయ నటుడు- రాబర్ట్ డౌనీ జూనియర్
- బెస్ట్ ఒరిజినల్ స్కోర్- 'వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్' (What Was I Made For?)
- బెస్ట్ సినిమాటోగ్రఫీ- ఓపెన్‌హైమర్
- బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్- జెన్నిఫర్ లేమ్
ప్రముఖ భౌతిక శాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్తగా పేరుగాంచిన జె. రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా ఓపెన్ హైమర్ రూపొందింది. ఈ సినిమాకు ప్రముఖ బ్రిటన్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించారు. దాదాపు 100 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 2023 జూలై 21న రిలీజై భారీ విజయం దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ఓపెన్ హైమర్ ఏకందా 900 మిలియన్ డాలర్లు వసూల్ చేసింది.