తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవర్​ఫుల్​ పోస్టర్​తో బాలయ్య NBK 109 సర్​ప్రైజ్​ - టైటిల్​ టీజర్​ అప్డేట్​ వచ్చేసిందోచ్​ - NBK 109 TITLE TEASER UPDATE

బాలయ్య NBK 109 టైటిల్ టీజర్​ గురించి అఫీషియల్​ అప్డేట్​ ఇచ్చిన మూవీ టీమ్​!

Balakrishna NBK 109 Title Teaser Update
Balakrishna NBK 109 Title Teaser Update (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2024, 6:10 PM IST

Balakrishna NBK 109 Title Teaser Update : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం 'NBK109' (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్ర టీజర్ విశేషంగా ఆకట్టుకోవడంతో ఫ్యాన్స్​తో పాటు సినీ ప్రియులకు సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఇటీవలే దసరా కానుకగా టైటిల్ అనౌన్స్​మెంట్, టీజర్​​ వస్తుందని అంతా ఆశించారు. కానీ అది జరగలేదు. కనీసం దీపావళి అయినా వస్తుందని అనుకున్నారు. అప్పుడు కూడా మేకర్స్ నిరుత్సాహపరిచారు. అదే సమయంలో టైటిల్ టీజర్ అనౌన్స్​మెంట్​కు ఇంకాస్త సమయం పడుతుందని నిర్మాత నాగవంశీ ఫ్యాన్స్​ను బుజ్జగించారు.

అయితే తాజాగా మేకర్స్​ నందమూరి ఫ్యాన్స్​లో జోష్ నింపేలా టైటిల్ టీజర్ అనౌన్స్​మెంట్​ అప్డేట్ ఇచ్చేశారు. ఈ నెల 15న ఉదయం 10:24 గంటలకు టైటిల్‌ను ప్రకటించి, టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది 2025 సంక్రాంతికి సినిమాను ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్​గా విడుదల చేయనున్నట్లు కన్ఫామ్ చేశారు. అలానే ఓ పవర్​ఫుల్ పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్యను వెనకవైపు నుంచి చూపించారు. బాలయ్య వీపుపై గన్​, గొడ్డలి పట్టుకుని సీరియస్​గా, వైల్డ్​గా నిలబడి కనిపించారు.

ఆ మధ్య నిర్మాత నాగవంశీ టైటిల్ టీజర్ గురించి మాట్లాడుతూ - వీడియో సీజీలతో మూడిపడి ఉంది. దర్శకుడు బాబీ టైటిల్​కు విజువల్​, బ్యాంగ్​తో ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు." అని చెప్పుకొచ్చారు.

ఇకపోతే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్​ బాబీ దేఓల్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. బీటౌన్​ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్​లో చిందులేయనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్​తో నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డాకు మహారాజ్, వీరమాస్, సర్కార్ సీతారాం ఇలా పలు రకాల టైటిల్స్​ వినిపిస్తున్నాయి. బాలయ్యను ఇదివరకు ఎన్నడు చూడని విధంగా సరికొత్తగా చూపించబోతున్నారు బాబీ. హై యాక్షన్ ఎంటర్టైనర్​గా సినిమాను రూపొందిస్తున్నారు. గతేడాది విడుదలైన భగవంత్ కేసరి వంటి సూపర్ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మరింత హైప్ నెలకొంది.

ప్రభాస్​ 'స్పిరిట్​'​ అప్డేట్​ - దూసుకెళ్లేందుకు సిద్ధంగా!

అందాల పోటీల్లో భారత్‌కు మరో కిరీటం - ఎవరీ మిస్ టీన్ యూనివర్స్ తృష్ణా రే?

ABOUT THE AUTHOR

...view details