Nikhil swayambhu Movie : టాలీవుడ్ హీరో నిఖిల్ అప్పట్లో 'కార్తికేయ 2' చిత్రంతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'స్పై' మిస్టరీ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. ఆ తర్వాత నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'స్వయంభు'. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంగా ఇది రానుంది.
swayambhu Movie Shooting :దేవీ నవరాత్రులను పురస్కరించుకుని తాజాగా స్వయంభు సెట్‌లో ఆయుధ పూజను నిర్వహించారు. చిత్రంలో ఉపయోగిస్తున్న ఆయుధాలన్నింటికీ పూజ చేశారు. వీటికి సంబంధించిన స్పెషల్ వీడియోను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ప్రజలకు దసరా శుభాకాంక్షలను చెప్పింది. కాగా, ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతమందిస్తున్నారు. మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నిఖిల్ సరసన సంయుక్త మేనన్ నటించనుంది. ఈ సినిమాలో మరో నాయికగా నభా నటేష్ కనిపించనుంది. ఇది నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా రానుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతోంది. చిత్రంలో నిఖిల్ ఓ యోధుడిగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం తను ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
Nikhil Upcoming Movie :ఇక ఈ చిత్రంతో పాటు సుధీర్ వర్మతో హీరో నిఖిల్ ఓ సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ది ఇండియా హౌస్ పేరుతో ఇది తెరకెక్కనుంది. అలాగే కార్తికేయ3 కూడా లైన్‌లో ఉంది.