తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

గ్రాండ్​గా అమీ జాక్సన్ మ్యారేజ్​- వరుడు హాలీవుడ్​ హీరో!! - Amy Jackson Marriage - AMY JACKSON MARRIAGE

Amy Jackson Marriage : నటి అమీజాక్షన్ మ్యారేజ్​ గ్రాండ్​గా జరిగింది. హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్​విక్​తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

Amy Jackson Marriage
Amy Jackson Marriage (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2024, 10:29 PM IST

Amy Jackson Marriage : నటి అమీ జాక్సన్‌, హాలీవుడ్‌ నటుడు ఎడ్‌ వెస్ట్‌విక్‌ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వీరి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. సోషల్‌ మీడియా వేదికగా ఇరువురు తమ వెడ్డింగ్‌ పిక్స్‌ పోస్ట్‌ చేశారు. కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైందంటూ అభిమానులకు పెళ్లి కబురు చెప్పారు. కొంతకాలం పాటు ప్రేమలో ఉన్నట్లు వీరు తాజాగా పెళ్లి చేసుకున్నారు.

అయితే జార్జ్‌ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో అమీ జాక్సన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కొంతకాలంపాటు సహజీవనంలో ఉన్న ఆ జంటకు ఆండ్రూ అనే బాబు కూడా జన్మించాడు. అమీ-జార్జ్‌ 2020లో వివాహం చేసుకోవాలని భావించారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో వాళ్లిద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల విడిపోయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి.

కాగా, సౌదీ అరేబియాలో జరిగిన ఓ ఫిల్మ్​ ఫెస్టివల్‌లో ఎడ్‌ను తొలిసారి కలిశారు అమీ. అదే సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఎవడు, ఐ, 2. ఓ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అమీ జాక్సన్‌. ఆమె నటించిన మిషన్‌: ఛాప్టర్‌ 1 (తమిళ్‌), క్రాక్‌ (హిందీ) ఇటీవల రిలీజ్ అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details