Kaun Banega Crorepati Pawan Kalyan : తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కల్యాణ్ పవర్ స్టార్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య రాజకీయాల్లోనూ అద్భుత విజయం సాధించి చరిత్ర సృష్టించారు. 21 ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్నారు. దీంతో పవన్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. అయితే తాజాగా ఓ ప్రఖ్యాత షోలో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఓ ప్రశ్న అడగడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంతకీ ఆ షో ఏంటంటే? - బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రీసెంట్గా కల్కి 2898 ఏడీ చిత్రంలో అశ్వత్థామగా అద్భుతమైన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మన్స్తో కనిపించి మెప్పించారు. అయితే అమితాబ్ కేవలం బిగ్ స్క్రీన్‌పై మాత్రమే కాకుండా స్మాల్ స్క్రీన్‌పై కూడా హోస్ట్‌గా ఓ ప్రఖ్యాత షో చేస్తున్నారు. అదే 'కౌన్ బనేగా కరోడ్‌పతి'. దీనిని తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటూ కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ కూడా హోస్ట్ చేశారు.
అయితే ప్రస్తుతం హిందీలో కౌన్ బనేగా కరోడ్‌పతి 16వ సీజన్ నడుస్తోంది. దీనికి కూడా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను పవన్‌కు సంబంధించిన ప్రశ్నను అడగటం ప్రస్తుతం వైరల్‌గా మారింది. '2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నటుడు ఎవరు?' అని ప్రశ్న వేశారు.