Amitabh Bachchan Black Movie :బాలీవుడ్లో ఓ సినిమా రిలీజైన 19 ఏళ్లకు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన 'బ్లాక్' మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదిక స్ట్రీమ్ అవుతోంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసి ఈ విషయాన్నిఅనౌన్స్ చేసింది.
"బ్లాక్ సినిమా విడుదలై 19 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజు నెట్ ఫ్లిక్స్ లోకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాం. దేబ్రాజ్, మిచెల్ ప్రయాణం మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మీకు కూడా స్ఫూర్తిని కలిగిస్తుందని మేము భావిస్తున్నాం" అంటూ ఆ వీడియోను పోస్ట్ చేశారు.
Black Movie Cast : దేబ్రాజ్ అనే టీచర్ రోల్లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కనిపించారు. సీనియర్ నటి రాణి ముఖర్జీ ఇందులో చెవిటి, చూపు కోల్పోయిన అమ్మాయిగా కనిపించింది. అయేషా కపూర్, షెర్నాజ్ పటేల్, ధృతిమాన్ ఛటర్జీ ఈ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. 2005లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచనల విజయాన్ని సాధించింది. అంతే కాకుండా ప్రశంసలతో పాటు పలు అవార్డులను సైతం అందుకుంది.