Pushpa 2 3D Screening : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ ముందు అదరగొడుతోంది. విడుదలై 20 రోజులు దాటినప్పటికీ కలెక్షన్ల జోరు మాత్రం ఆగట్లేదు. ఇప్పటికే ఈ సినిమా రూ.1500 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఇక మూవీ లవర్స్‌కు మేకర్స్ తాజాగా గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ సినిమా త్రీ డీ వెర్షన్ అందుబాటులోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా త్రీడీలో అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా త్రీడీ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా హిందీలో ఈ చిత్ర త్రీడీ వెర్షన్ ప్రదర్శస్తున్నట్లు మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా ప్రకటించింది.
అప్పుడే అనుకున్నా
అయితే ఈ సినిమాను ముందుగా వరల్డ్‌వైడ్ త్రీడీలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ, పలు కారణాల వల్ల అప్పుడు త్రీ డీ వెర్షన్లో విడుదల చేయడం కుదరలేదు. ఇక తాజాగా హిందీ భాషలో దీని త్రీడీ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.
బీటౌన్‌లో జోరు
బాలీవుడ్లో 'పుష్ప'కు రిలీజ్ ముందు నుంచే విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక సినిమాకు మంచి టాక్ రావడం వల్ల హిందీ వసూళ్లలో పుష్పరాజ్ జోరు ప్రదర్శిస్తున్నాడు. ఒక్క హిందీలోనే ఈ సినిమా రూ.700 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఈ క్రమంలో బాలీవుడ్ హిస్టరీలో తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ వారంలో క్రిస్మస్ హాలీడేస్ ఉండడం వల్ల ఈ వీకెండ్ కలెక్షన్లు మరింత పెరగడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.