తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అన్​స్టాపబుల్​లో బన్నీ పిల్లల సందడి- తెలుగు పద్యం పాడిన అర్హ- బాలయ్య ఫిదా! - UNSTOPPABLE WITH ALLU ARJUN

అన్​స్టాపబుల్​లో బన్నీ పిల్లల సందడి- తెలుగులో పద్యం చెప్పిన అర్హ- స్పెషల్ అట్రాక్షన్​గా చిన్నారులు

Unstoppable With Allu Arjun
Unstoppable With Allu Arjun (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2024, 11:19 AM IST

Unstoppable With Allu Arjun :నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ హోస్ట్​హా వ్యవహరిస్తున్న 'అన్​స్టాపబుల్ సీజన్ 4 టాక్ షో'కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించి రీసెంట్​గా తొలి ఈ ఎపిసోడ్ రిలీజ్ కాగా, తాజాగా రెండో ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో బన్నీ కూమారుడు అయాన్, కుమార్తె అర్హ వచ్చారు. పిల్లలు ఇద్దరితో బాలయ్యతో సరదాగా గడిపారు.

వాళ్లిద్దర్నీ ఆటపట్టిస్తూ బాలయ్య కూడా సందడి చేశారు. ఈ క్రమంలోనే 'అర్హ నీకు తెలుగు వచ్చా?' అని బాలయ్య అడగ్గా, తెలుగు వచ్చా, అదరగొట్టేస్తుంది? అనే తరహాలో బన్నీ రిప్లై ఇచ్చారు. ఇంతలోనే చిన్నారి అర్హ క్లిష్టమైన తెలుగు పద్యం అవలీలగా పాడి వినిపించింది. 'అటజని కాంచె భూమిసురు డంబర' పద్యం చకచకా చెప్పేసింది. 8ఏళ్ల చిన్నారి అలా తెలుగులో గుక్కతిప్పుకోకుండా క్యూట్​గా పద్యం చెప్పడంతో, ఒక్కసారిగా షో లో బాలయ్యతో సహా, ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు.

బన్నీ గారాల పట్టి బుజ్జి బుజ్జి తెలుగు పదాలు విన్నాక 'నాలుగు కాలాలపాటు తెలుగు బతికుంటుందనిపిస్తుంది' అని బాలయ్య అన్నారు. ఇక అర్హ పాప తెలుగులో మాట్లాడడం చూసి ఫ్యాన్స్​ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు. చిన్నప్పటి నుంచే పాపకు తెలుగు నేర్పించడంతో బన్నీ గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక అయాన్ కూడా తన చేష్టలతో షోలో అట్రాక్షన్​గా నిలిచాడు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్​గా మారిపోయింది.

ఇక పుష్ప సినిమా గురించి కూడా బాలయ్య కాసేపు బన్నీతో చర్చించారు. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్​కు ఫోన్ చేసి సరదాగా మాట్లాడారు. ఈ సినిమాపై బన్నీ గట్టి నమ్మకంతో ఉన్నారు. సినిమా భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 'మాస్ చూశారు, ఊర మాస్ చూశారు. పుష్ప 2కి మాత్రం జాతర మాస్ చూస్తారు' అని బన్నీ అన్నారు. కాగా, సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.

ఇది కదా 'పుష్ప రాజ్' బ్రాండ్ అంటే- తెలుగులో తొలి సినిమాగా రికార్డ్!

2000 మంది జూనియర్లు, 300 మంది డ్యాన్సర్లు- జాతర ఎపిసోడ్​కు థియేటర్లో పూనకాలే!

ABOUT THE AUTHOR

...view details